తెలుగు సినిమాలకు బాలీవుడ్‌లో మంచి గిరాకీ ఉంది. బాహుబలి, పుష్ప 2 వంటి సినిమాలే ఇందుకు నిదర్శనం. ఇంకా కార్తీకేయ 2, సీతారామం, దేవర వంటి సినిమాలు కూడా హిందీ బాక్సాఫీస్ వద్ద హిట్స్ గానే నిలిచాయి.
ఇలా కొంతమంది తెలుగు హీరోలు డైరెక్ట్‌గా హిందీ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. రామ్‌చరణ్ ఈ ప్రయత్నాలను ఎప్పట్నుంచో మొదలుపెట్టాడు. కానీ సినిమాయే ఫైనలైజ్ కావడం లేదు. నిజానికి పన్నెండు సంవత్సరాల క్రితమే రామ్‌చరణ్ ‘జంజీర్’ అనే స్ట్రయిట్ హిందీ మూవీని చేశారు. ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. అప్పట్నుంచి హిందీ వైపు రామ్‌చరణ్ తిరిగి చూడనే లేదు. తన కెరీర్‌లో తాను చేసిన తప్పు హిందీలో ‘జంజీర్’ మూవీ చేయడమే అని, ‘గేమ్‌చేంజర్’ ప్రమోషన్స్‌లో రామ్‌చరణ్ చెప్పిన మాటలు మర్చిపోలేనివి.
కానీ రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’తో రామ్‌చరణ్‌కు మంచి పేరు వచ్చింది. దీంతో రామ్‌చరణ్ బాలీవుడ్ ఆశలు మళ్లీ చిగురించాయి. కానీ ‘గేమ్‌చేంజర్‘ మూవీ హిందీలో డిజాస్టర్ అయ్యింది.
అయితే తన బాలీవుడ్ సినిమా పనులును మళ్లీ మొదలుపెట్టినట్లున్నారు రామ్‌చరణ్ (Ramcharan Next film). హిందీలో ‘కిల్’ వంటి ఫుల్‌ప్యాక్డ్ సక్సెస్‌ఫుల్ మూవీ తీసిన నిఖిల్‌భట్ (Nikhil Nagesg Bhat)తో రామ్‌చరణ్ చర్చలు జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇదొక మైథలాజికల్ ఫిల్మ్ అనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఈ సమయంలోనే రామ్‌చరణ్ సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే…రామ్‌చరణ్ (Ramcharan) చేసే మరో హిందీ సినిమా గనుక సరిగ్గా ఆడకపోతే..అది చరణ్ హిందీ మార్కెట్‌ను దారుణంగా దెబ్బతీస్తుంది. పైగా..అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం ఆల్రెడీ హిందీ బాక్సాఫీస్ వద్ద రూ. 800 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ రేంజ్‌లో కాకపోయిన, కనీసం హిట్ స్టేటస్‌ను దక్కించుకోవాల్సిన ప్రెజర్ రామ్‌చరణ్‌కు హిందీ మూవీపై ఉం టుంది. హిందీ మార్కెట్ కోసం వెంటనే ఏదో ఒక సినిమా చేస్తే…జంజీర్ తప్పు రిపీట్ కావొచ్చు. కానీ మళ్లీ ఆ తప్పు రిపీట్ కాకూడదు. మరి…హిందీ మార్కెట్ కోసం రామ్‌చరణ్ ఎలాంటి వ్యూహాలు రచిస్తాడో, ఏ డైరెక్టర్‌ని ఫైనలైజ్ చేస్తాడో చూడాలి.
బాలీవుడ్ టాప్ హీరోలే తెలుగు సినిమాలు, దక్షిణాది దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఈ తరుణంలో రామ్‌చరణ్ ఏ బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్‌ను ఫైనలైజ్ చేస్తారో అన్న ఆసక్తి ఇండస్ట్రీలో ఉంది.
ప్రస్తుతం ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సనతో ‘పవర్‌క్రికెట్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ చేస్తున్నాడు రామ్‌చరణ్. అలాగే ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత సుకుమార్‌తో రామ్‌చరణ్ మరో మూవీ కమిటైన సంగతి తెలిసిందే.