Ramcharan Peddhi: సైలెంట్‌గా కథను మార్చేశారా?

Viswa
1 Min Read

Ramcharan Peddhi: ‘ఉప్పెన’ సినిమా తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సాన (Buchi Babu Sana) ఓ స్పోర్ట్స్‌ డ్రామాను తీయాలనుకున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌తో కొంతకాలం ట్రావెల్‌ అయ్యారు. కానీ సడన్‌గా ఈ సినిమా ఎన్టీఆర్‌తో వర్కౌట్‌కాలేదు. దీంతో కథ రామ్‌చరణ్‌ (Ramcharan) వద్దకు వచ్చింది. ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) టైటిల్‌తో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమా మొదట్నుంచి కూడా కబడ్డీ నేపథ్యంలో ఉంటుందని ప్రచారంసాగింది. కథ అంతా ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఉంటుందని, ఉత్తరాంధ్ర లొకేషన్స్‌లోనే జరుగుతుందనిబుచ్చిబాబు సాన చెప్పారు. ఓ దశలో నటీనటులు కావాలనుకునే ఉత్తరాంధ్ర ప్రజలు మమ్మల్ని సంప్రదించాలని కూడా బుచ్చిబాబు చెప్పారు.

రామ్‌చరణ్‌ కెరీర్‌లోని ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల మైసూర్‌లో ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్‌ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ట్విస్ట్‌ ఏంటంటే..కబడ్డీ కాదు… ఓ సెట్‌లో క్రికెట్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అసలు…కబడ్డీ ప్లేస్‌లో క్రికెట్‌ ఎందుకు వచ్చిందనే చర్చ మొదలైంది ఇండస్ట్రీలో. పైగా ఉత్తరాంధ్ర లొకేషన్స్‌లో షూటింగ్‌ ఇంకా స్టార్ట్‌ కాలేదు. మైసూర్‌లో తొలి షెడ్యూల్‌ చేశారు. రెండో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. థర్డ్‌ షెడ్యూల్‌ కేరళ అంటున్నారు. ఈ ప్రకారం ఉత్తరాంధ్రలో ఎప్పుడూ షూటింగ్‌ చేస్తారనే చర్చ జరుగుతోంది. దీంతో..అసలు రామ్‌చరణ్‌(Ramchan) తో బుచ్చిబాబు తీసే సినిమా కథ మారిందా? కబడ్డీ ప్లేస్‌లో క్రికెట్‌ పెట్టారా? లేక వేరే కథతో రామ్‌చరణ్‌తో బుచ్చిబాబు సినిమా తీస్తున్నాడా? అనే అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఈ విషయాలపై ఓ క్లారిటీ రావాలంటే మేకర్స్‌ స్పందించాల్సిందే.

మైత్రీమూవీమేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్, వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఇందులో జాన్వీకపూర్‌ హీరోయిన్‌. సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది కాబట్టి 2025లోనే ఈ సినిమా థియేటర్స్‌లోకి వచ్చే చాన్సెస్‌ కనిపిస్తున్నాయి.

Share This Article
3 Comments