రామ్‌చరణ్ కొత్త సినిమాకు ‘పెద్ది (Ramcharan Peddi Release)’ టైటిల్‌ను గురువారం అధికారికంగా ప్రకటించారు. గురువారం…అంటే మార్చి 27న రామ్‌చరణ్ బర్త్ డే. ఈ సందర్బంగా ‘పెద్ది (Peddi)’ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించి, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన ఈ సినిమాకు దర్శకుడు. జగపతిబాబు, దివ్వేందు, శివరాజ్‌కుమార్ ఇతర ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ రూరల్ అండ్ రిస్టిక్‌డ్రామాలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామాను మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వృద్ధి సినిమాస్ వెంకటసతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
Ramcharan Peddhi: సైలెంట్‌గా కథను మార్చేశారా?
ఉగాదికి గ్లింప్స్

రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ‘పెద్ది’ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ చిత్రం దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల అస్వస్థతతో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. దీంతో ‘పెద్ది’ గ్లింప్స్ విడుదల వాయిదా పడింది. ఉగాదికి గ్లింప్స్ వీడియోను…అంటే టీజర్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఒకవేళ ఉగాదికి రిలీజ్ కాకపోతే…వేసవిలో రిలీజ్ చేస్తారట.
ఆటకూలిగా రామ్‌చరణ్
ఈ పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామాలో ఆటకూలిగా కనిపిస్తారట రామ్‌చరణ్. ఈ సినిమాలో కథ ప్రకారం ప్రధానంగా..క్రికెట్, కుస్తీ, కబడ్డీ…ఆటల ప్రస్తావన ఉంటుంది. ఈ మూడు ఆటల్లో రామ్‌చరణ్‌కు ప్రావీణ్యం ఉంటుంది. ఏ రోజు ఏ ఆట పంద్దెం ఉంటే..ఆ రోజు…ఆ ఆట ఆటగాడిగా మారిపోతుంటాడు రామ్‌చరణ్. ఇలా ఈ సినిమాలో రామ్‌చరణ్ ఓ ఆట కూలిగా కనిపిస్తాడు. శివరాజ్‌కుమార్ గురువు గా కనిపిస్తారు. అంటే.. రామ్‌చరణ్‌కు కోచ్ పాత్ర అన్నమాట.
వచ్చే ఏడాది రిలీజ్
పెద్ది సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నారు. దీపావళి రిలీజ్‌కు ప్లాన్ చేశారు. కానీ వచ్చే ఏడాది మార్చిలో పెద్ది సినిమా రిలీజ్ అవుతుంట. ‘రంగస్థలం, ఆర్‌ఆర్‌ఆర్’ వంటి సినిమాలు మార్చి చివర్లోనే రిలీజ్ అయ్యాయి. పైగా మార్చి 27న రామ్‌చరణ్ బర్త్‌డే. వచ్చే ఏడాది మార్చి 26 వీకెండ్ ఉంది. సో.. ఈ మూవీని 2026 మార్చి 26న రిలీజ్ చేయాలని, రామ్‌చరణ్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట.
సుకుమార్‌తో సినిమా
‘రంగస్థలం’ తర్వాత దర్శకుడు సుకుమార్‌తో రామ్‌చరణ్ మరో మూవీ చేయనున్నాడు. పోయిన ఏడాది రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ అధికారిక ప్రకటన వెల్లడైంది. కానీ ఈ ఏడాది రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ అప్‌డేట్ రాలేదు. ‘పెద్ది’ సినిమా తర్వాత రామ్‌చరణ్ నెక్ట్స్ మూవీ సుకుమార్‌తోనే ఉంటుంది.