రవితేజ సూపర్‌హీరోగా ఓ మూవీ (Raviteja next film)రానుంది. ‘మ్యాడ్, మ్యాడ్ 2’ సినిమాలతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కళ్యాణ్ శంకర్ (mad Director kalyanshankar) డైరెక్షన్‌లో రవితేజ సూపర్‌హీరో మూవీ రానుంది. రవితేజతో ఈ మూవీ చేయ నున్నట్లుగా కళ్యాణ్ శంకర్ కన్ఫార్మ్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, సీజీ వర్క్‌కూడా చేయాల్సి ఉందని, ఆగస్టులో చిత్రీకరణను ప్లాన్ చేశామని కల్యాణ్‌శంకర్ చెప్పుకొచ్చారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తారు.
ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’ మూవీ చేస్తున్నారు. కొత్త దర్శకుడు భాను భోగవరపు దర్శకుడు. మే 9న రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ వాయిదా పడింది. ఈ ఏడాది చివర్లో రిలీజ్ కావొచ్చు. ఈ మూవీ తర్వాత కిషోర్ తిరుములతోనూ ఓ మూవీ చేస్తారు రవితేజ. ఈ మూవీకి అనార్కలి అనే టైటిల్‌ను పరిశీలి స్తున్నారు. ఈ మూవీతో పాటు సమాంతరంగా కల్యాణ్‌శంకర్ మూవీలోనూ రవితేజ యాక్ట్ చేస్తారని తెలుస్తుంది.