రాజమౌళిని రవితేజ తక్కువగా అంచనావేస్తున్నాడా?

Viswa
Raviteja MassJathara Release date

రవితేజ (Raviteja) లేటెస్ట్‌ మూవీ ‘మాస్‌ జాతర (Mass Jathara)’. ఇప్పటికే ఈ సినిమా నాలుగుసార్లు వాయిదా పడింది. కొత్త విడుదల తేదీపై ఇంకా ఓ క్లారిటీ రాలేదు. అక్టోబరు 31న మాస్‌ జాతర సినిమాను రిలీజ్‌ చేయాలన్నది ఈ టీమ్‌ లేటెస్ట్‌ ప్లాన్‌. కానీ అదే రోజు రాజమౌళి డైరెక్షన్‌లోని ‘బాహుబలి: ది ఎపిక్‌’ (BaahubaliTheEpic) చిత్రం విడుదల కానుంది. ‘బాహుబలి పార్టు1, బాహుబలి పార్టు 2’ చిత్రాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్‌’గా అక్టోబరు 31న రిలీజ్‌ అవుతోంది. ఆల్రెడీ టీజర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. అక్టోబరు మొదటివారంలో ‘బాహుబలి: ది ఎపిక్‌’ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను షురూ చేయనున్నారు. కానీ ఇదే రోజు రవితేజ ‘మాస్‌ జాతర’ సినిమా విడుదల అయితే రవితేజ కచ్చితంగా రిస్క్‌ చేసినట్లే.

పైగా రావాణాసుర, టైగర్‌ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్‌ బచ్చన్‌…ఇలా వరుస సినిమాల వైఫ ల్యాలతో, రవితేజ కెరీర్‌లో ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి తరుణంలో ‘బాహుబలి: ది ఎపిక్‌’ సినిమాతో పాటు, తన ‘మాస్‌ జాతర’ సినిమాను విడుదల చేస్తే, బాక్సాఫీస్‌ రిజల్ట్‌ కూడా తేడా కొట్టొచ్చు. ‘బాహుబలి’ సినిమాను ఆడియన్స్‌ను ఓ సెలబ్రేషన్‌లా చూస్తారు. పైగా..రాజమౌళి అంతటివాడే పూనుకున్నాడంటే….‘బాహుబలి: ది ఎపిక్‌’లో కచ్చితంగా, ఏదో ఒక మ్యాజిక్‌ ఉంటుంది. ఒకవేళ ఇండియన్‌ సినిమా మార్కెట్‌ని అమాంతం పెంచేసిన రాజమౌళిని తక్కువగా అంచనా వేసి, ‘బాహుబలి ది ఎపిక్‌’ రిలీజ్‌ రోజునే, ‘మాస్‌ జాతర’ సినిమానూ విడుదల చేస్తే, రవితేజ అండ్‌ టీమ్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

‘ధమాకా’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్‌ శ్రీలీల ఈ సినిమా చేస్తున్నారు. నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో రైల్వే పోలీస్‌ ఆఫీసర్‌ లక్ష్మణ్‌భేరిగా రవితేజ నటిస్తున్నారు. భీమ్స్‌ సిసిరోలియో ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఈ సంక్రాంతికి, మే 9న, ఆగస్టు 27న మాస్‌ జాతర సినిమా రిలీజ్‌ డేట్స్‌ను ప్రకటించిన, ఈ తేదీలకు మాస్‌ జాతర చిత్రం విడుదల కాలేదు. హిట్‌ ఫిల్మ్‌ శ్రీవిష్ణు సామజవరగమన చిత్రానికి డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన, శ్రీవిష్ణు సినిమా సింగిల్‌కు డైలాగ్స్‌ రాసిన భాను భోగవరపు ఈ మాస్‌ జాతర చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

రొమాంటిక్‌ కామెడీ లిటిల్‌హార్ట్స్‌ రివ్యూ

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *