రవితేజ కెరీర్ కాస్త గాడి తప్పినప్పుడు ‘క్రాక్’ సినిమా ఆయన్ను మళ్లీ గాడిలో పెట్టింది. ఈ సినిమా 2021 సంక్రాంతి సమయంలో రిలీజైంది.
రీసెంట్ టైమ్స్‌లో సంక్రాంతి రిలీజ్ కోసం తీవ్రంగా ట్రై చేస్తున్న హీరోల్లో రవితేజ (Raviteja) ఒకరు. ‘ఈగల్’ (Raviteja Movie Release) సినిమాను 2024 సంక్రాంతి సమయంలో రిలీజ్ చేయాలని రవితేజ, ఈ చిత్రం నిర్మాత టీజీ విశ్వప్రసాద్ విశ్వప్రయత్నాలు చేశారు. కానీ రిలీజ్ కాలేదు. మహేశ్‌బాబు ‘గుంటూరుకారం’, తేజా సజ్జా ‘హను–మాన్’, వెంకటేష్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాలు సంక్రాంతికి రిలీజైయ్యాయి. ‘ఈగల్’ మాత్రం ఫిబ్రవరి 9న విడుదలైంది. కమర్షియల్‌గా హిట్‌గా నిలవలేకపోయింది.
2024 సంక్రాంతి మిస్ కావడంతో, 2025 సంక్రాంతి కన్నా తన సినిమాను రిలీజ్ చేయాలని రవితేజ ట్రై చేశారు. ‘మాస్ జాతర’ సినిమాను షూరు చేశారు. 2025 సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించారు. కానీ ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో రవితేజ గాయపడటం, ఈ మూవీలోని హీరోయిన్ శ్రీలీల ఇతర వరుస సినిమాలతో బిజీ కావడం వంటి అంశాలతో ‘మాస్ జాతర’ షూటింగ్ కంటిన్యూస్‌గా సాగలేదు. ఫలితంగా 2025 సంక్రాంతి నుంచి రవితేజ ‘మాస్ జాతర’ తప్పుకుంది. రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహా రాజ్’, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు 2025 సంక్రాంతికి విడుదల అయ్యాయి.
ఇప్పుడు మళ్లీ 2026 సంక్రాంతికి తన మూవీని రిలీజ్ చేయాలని రవితేజ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో రవితేజ ఓ మూవీ కమిటైయ్యారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైపులో ఈ మూవీ కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ‘అనార్కలి’ అనే టైటిల్ అనుకుంటున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారు.ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది రవితేజ ప్లాన్. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు. వేసవి తర్వాత ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసి, సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది రవితేజ ప్లాన్. తన సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని, వరుసగా రెండేళ్లు ప్రయత్నించినా, రవితేజకు కుదర్లేదు. మరి…ఈ సారి అయిన రవితేజ సినిమా సంక్రాంతికి వస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
ఇక ఆల్రెడీ 2026 సంక్రాంతికి చిరంజీవి, ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. మరి…మరో ఇద్దరు హీరోలు కూడా ట్రై చేస్తున్నారు. ఈ తరుణంలో రవితేజ సినిమాకూ స్పేస్ దొరుకుందా? అనేది చూడాలి.