ఇది కదా నిజమైన సక్సెస్‌ అంటే..!ఆఫీస్‌ బాయ్‌ టు పాన్‌ఇండియా స్టార్‌

Viswa

Web Stories

‘కాంతార, కాంతార చాప్టర్‌ 1’ సినిమాలతో దర్శకుడిగా, నటుడిగా రిషబ్‌శెట్టి గురించి సినీ ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. కానీ రిషబ్‌శెట్టి జర్నీ ఓ ఆఫీస్‌ బాయ్‌ నుంచి ప్రారంభమైంది. 2008లో ముంబైలోని ఓ నిర్మాణ సంస్థలో రిషబ్‌శెట్టి ఆఫీస్‌బాయ్‌గా పని చేశాడు. నిర్మాతకు డ్రైవర్‌గా వర్క్‌ చేశాడు. సరైన జీతం కూడా రాలేదు. కానీ ఆ సమ యంలో హిందీ నేర్చుకోవడానికి రిషబ్‌కు అవకాశం లభించింది.

ఇక సినిమాల్లో నటుడిగా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన తర్వాత ఆశించినంత సక్సెస్‌ అయితే రాలేదు.
దర్శకుడిగా రిక్కీ (2016) అనే సినిమా తీశాడు. కానీ ఈ సినిమా ప్రదర్శనకు సరైన షోలో కూడా లభించలేదట.

‘‘2016లో ఒక్క షో ప్రదర్శన కోసం ఎంతో స్ట్రగుల్‌ చేశాం. ఇప్పుడు ‘కాంతార చాప్టర్‌ 1’ సినిమా దాదాపు 5000పైగా థియేటర్స్‌లో హౌస్‌ఫుల్స్‌తో రన్‌ అవుతోంది. ప్రేక్షకుల ప్రేమ, దేవుడి దయ వల్లే ఇది సాధ్యమైంది’’ అంటూ రిషబ్‌శెట్టి ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

నిజంగా ఓ ఆఫీస్‌బాయ్‌గా మొదలైన రిషబ్‌శెట్టి జర్నీ, ఇప్పుడు ఓ పెద్ద పాన్‌ ఇండియన్‌స్టార్‌గా ఉండటం అనేది గొప్ప విషయం. స్ఫూర్తిదాయకం కదా!

Please Share
1 Comment
  • МелБет бонус за регистрацию предлагают широкий выбор преимуществ для новых игроков и постоянных клиентов, включая приветственные предложения и акции на депозиты.
    Данный бонус дает возможность увеличить вашу первую ставку вдвое.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos