సినిమా: కాంతార చాప్టర్ 1 (kantara chapter1Review)
ప్రధాన తారాగణం: రిషబ్ శెట్టి, జయరాం, రుక్మిణీ వసంత్, గుల్షన్ దేవయ్య
దర్శకత్వం: రిషబ్ శెట్టి
నిర్మాణం: హోంబలే ఫిలిమ్స్ (విజయ్ కిరగందూర్, చలువే గౌడ)
కెమెరా: అరవింద్ కశ్యప్
సంగీతం: అజనీష్ లోకనాథ్
ఎడిటింగ్: సురేష్ మల్లయ్య
నిడివి: 2 గంటల 48 నిమిషాలు
విడుదల తేదీ: అక్టోబరు 2, 2025
సెన్సార్: ‘యూబైఏ’ (+16ఏజ్) సర్టిఫికేట్
రేటింగ్:3/5
kantara chapter1Review: కాంతార కాపరి బెర్మి (రిషబ్‌శెట్టి). కాంతార ప్రాంతంలోనే ఈశ్వరుడి పూతోట ఉంటుంది. ఈ పూతోటను సొంతం చేసుకోవాలని బంగ్రా రాజు ఆశపడి, అక్కడికి వెళ్లి, మరణి స్తాడు. చని పోయిన రాజు కొడుకు రాజశేఖర్ (జయరాం). కాంతారలో తన కళ్లముందే తండ్రి చనిపోవ డం తో, కాంతారకు వెళ్లకూడదని, అక్కడ బ్రహ్మారాక్షసుడు ఉన్నాడని, తన వారసులకు (కుమార్తె కనకావతి, కుమారుడు కనకావతి) వారి చిన్నప్పట్నుంచే చెబుతుంటాడు (Kantarachapter1 Review)
మరోవైపు కాంతార హద్దు దాటి బంగ్రాకు వెళ్లకూడదని కాంతార పెద్ద కూడా, బెర్మి–అతని బృందానికి చెబుతుంటాడు. కానీ రాజైన తర్వాత మద్యం మత్తులో కులశేఖరుడు కాంతారకు వెళ్లి, అక్కడి పరిస్థితులకు భయపడి తిరిగి వస్తాడు. ఇటు బెర్మి కూడా బంగ్రాకు వెళ్లి, తమ దగ్గర ఉన్న అడవి పరికరాలు, దినుసులు (సుగంధద్రవ్యాలు వంటివి) విలువ తెలసుకుని, బంగ్రాకు దగ్గర్లోని బందర్‌లో వ్యాపారం చేసి, కాంతార ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించాలని ఆశపడతాడు. ఇంకోవైపు బంగ్రా రాజ వంశస్తులతో పాటుగా, తాంత్రిక శక్తులపై పట్టున్న కడపటి వారు కూడా ఈశ్వరుడి పూతోటను సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. మరి కాంతార ప్రజలకు బెర్మి ఎలా అండగా నిలిచాడు? రాజవంశస్థలు, కడపటివారు ఈశ్వరుడి పూతోటను వశం చేసుకోవడానికి ఎలాంటి వ్యూహాలు రచించారు. కష్టకాలంలో కాంతార ప్రజలకు ఈశ్వరుడి గణాలు ఎలా తోడుగా నిలిచాయి? అసలు..ఈశ్వరుడి పూతోటలో ఏముంది? అనేది సినిమాలో చూడాలి (Kantarachapter1Reviewintelugu).
విశ్లేషణ
ఈశ్వరుడి పూతోటను కాంతార వాళ్ళు కాపాలగా ఉంటుంటే, ఈ ఈశ్వరుడి పూతోటను కైవశం చేసుకోవాలని రాజవంశస్థులు, తాంత్రిక శక్తుల వాళ్లు ఎలా పన్నాగాలు పన్నారు? అన్నదే ఈ సినిమా కథ. వీటికి ఆథ్యాత్మిక అంశాలు, యుద్ధ సన్నివేశాలు వంటి వాటిని జోడించి, ‘కాంతార చాప్టర్ 1’ కథను వెండితెరపై అద్భుతంగా చూపించారు రిషబ్‌శెట్టి.
ఈశ్వరుడి పూతోట, ఈశ్వరుడి గణాలు, ఓ పెద్ద బావి, బంగ్రా రాజు, కడపటి వాళ్లు…అంటూ ఓ దంత కథ అని చెప్పే ఓ వాయిస్ ఓవర్‌తో ‘కాంతార చాప్టర్1’ కథ మొదల వుతుంది. ఈ వా యిస్ ఓవర్‌ను ఫాలో అయినప్పుడే కథలో డెప్త్‌ను ప్రేక్షకులు అర్థం చేసుకోగలరు. కథకు కనెక్ట్ కాగలరు. ఏమాత్రం ఫాలో కాకపోయినా, కన్‌ఫ్యూజ్ అయినా..కాంతార కథ కాస్త తికమకగా అనిపించొచ్చు (Kantarachapter1Story)
బెర్మి బందర్‌లో వ్యాపారం చేయాలనుకోవడం, కడపటివారితో ఫైట్ చేయడం, బంగ్రా రాణికి బెర్మి దగ్గరయ్యే సన్నివేశాలతో తొలిభాగం కథనం ఉంటుంది. కాంతారకు రక్షణగా ఉన్న ఈశ్వ రుడి గణాలను బంగ్రా నుంచి బెర్మి నాయకత్వంలో, కాంతార ప్రజలు ఎలా తిరిగి తెచ్చు కున్నా రు? అనే పాయింట్‌తో సెకండాఫ్ ముగుస్తుంది.
కాంతార సినిమా కథ మరీ కొత్తది ఏం కాదు. కానీ స్క్రీన్ ప్లే, కథనం బాగున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా వచ్చే మూమెంట్స్ సూపర్‌గా ఉన్నాయి. ప్రారంభం సన్నివేశాలు, హీరో ఇంట్రడక్షన్ ఫైట్, ఇంట్రవెల్ సీక్వెన్స్ స్క్రీన్‌పై ఎక్స్‌లెంట్‌గా ఉన్నాయి. ఇక సెకండాఫ్‌లో వచ్చే గుళిక ఎపి సోడ్, ప్రీ క్లైమాక్స్ సెటప్, క్లైమాక్స్ సీక్వెన్స్, బ్రహ్మాకలశ ఉత్సవం, ముఖ్యంగా టైగర్ వచ్చే సన్నివేశాలు…స్క్రీన్‌పై అత్యధ్భుతమైనే చెప్పాలి. ఆడియన్స్ విజువల్ ఫీస్ట్. మాస్ అప్పీల్ ఉన్న మూమెంట్స్ కూడా ఉన్నాయి. బ్రహ్మా రాక్షసుడు థియరీ, ఫస్టాప్‌లోని రథం ఏపిసోడ్ సాగదీత, కాంతార వాళ్లను బంధించే సన్నివేశాలు, కులశేఖర భోగవిలాసాల సన్నివేశాలు, లవ్‌ట్రాక్… ఇవన్నీ ఈ సినిమాలోని లోటుపాట్లు. కాంతార సినిమాపై ఉన్న అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండ ఉంటుంది ‘కాంతార చాప్టర్ 1’ సినిమా.
నటీనటులు-సాంకేతిక నిపుణల పెర్ఫార్మెన్స్
బెర్మి పాత్రలో రిషబ్‌శెట్టి (Kantarachapter1 Hero Rishabshetty) జీవించాడు. గుళిక ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌లో రిషబ్‌శెట్టి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడనిపిస్తుంది. బంగ్రారాజుగా జయరాం పాత్ర చాలా కీలకమైనది. కథను ముందుకు నడిపించే పాత్ర ఇది. సెకండాఫ్‌లో జయరాంకు మంచి సన్నివేశాలు పడ్డాయి. తన యాక్టింగ్ అనుభవాన్ని చూపించాడు. కనకావతిగా రుక్మిణీ వసంత్ ఈ సినిమాకు మేజర్ పిల్లర్. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న కనకావతిగా రుక్మిణీ వసంత్ మెప్పించారు. ఈ పాత్ర నుం చి రివీల్ అయ్యే ట్విస్ట్ కొత్తదేం కాకపోయినా, థియేటర్స్‌లో ఆడియన్స్‌ను థ్రిల్ చేసేలా ఉంటుంది. కులశేఖర్‌గా గుల్షన్ దేవయ్య మంచి యాక్టింగ్ టాలెంట్ చూపించాడు.

దర్శకుడిగా రిషబ్‌శెట్టి డైరెక్షన్, విజువల్ థాట్స్ సూపర్‌గా ఉన్నాయి. సీరియస్ కథలోనూ కామెడీని కరెక్ట్ చూపించిన రైటింగ్ నైపుణ్యం బాగుంది. కాకపోతే వార్ సీక్వెన్స్‌లలో ‘బాహు బలి’ ఎఫెక్ట్, చివర్లో ‘విరూపాక్ష’ సినిమా ఛాయలైతే కనిపించాయి. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా పెద్ద ఎస్సెట్. ఆర్‌ఆర్ కూడా ఎక్స్‌లెంట్‌గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్‌ను స్క్రీన్‌పై చక్కగా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఈ సినిమాకు ప్రాణం సినిమాటోగ్రఫీ. స్క్రీన్‌పై విజువల్స్ సూపర్భ్‌గా ఉన్నాయి. VFX వర్క్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి.

