Roshan Champion: శ్రీకాంత్ తనయుడు రోషన్ (Roshan) చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఛాంపియన్’ (Champion). స్వాతంత్య్రాని పూర్వం హైదరాబాద్‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా, ఈ ‘ఛాంపియన్’ సినిమా తీస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకుడు. ఇటీవల ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా టీజర్‌ను విడుదల చేశారు.
టీజర్‌ని బట్టి, ‘చాంపియన్’ మూవీలో మైఖేల్. సి. విలియమ్స్ అనే పాత్రలో రోషన్ నటిస్తు న్నట్లుగా స్పష్టం అవుతోంది. మైఖేల్. సి. విలియమ్స్ ఫుట్‌బాల్ ప్లేయర్. ఎంతటి గొప్ప ఫుట్ బాల్ ప్లేయర్ అంటే, ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్, తమ దేశం తరఫున మైఖేల్‌ను ఫుట్‌బాల్ ఆడమని చెబుతుందట. కానీ అంతటి అవకాశాన్ని కూడా స్వదేశం కోసం, ప్రేమ కోసం మైఖేల్ వదులకుంటాయట. ఈ అంశాల నేపథ్యంతో ‘ఛాంపియన్’ సినిమా కథ (Champion movie Story)ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.
అలాగే స్వాతంత్య్రానికి పూర్వం హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్ అంటే, ఈ సినిమాకు కచ్చితంగా రజాకర్ల నేపథ్యం ఉంటుందని తెలుస్తోంది. అయితే హైదరాబాద్‌లో ఉండే ఫుట్‌బాల్ ప్లేయర్ మైఖేల్. సి విలియమ్స్….ఎందుకు గన్ పట్టుకున్నాడు? అనేది సినిమాలో చూడాలి.
ఈ ‘ఛాంపియన్’ సినిమాతో మలయాళ యువ నటి అనస్వర రాజన్ ఫిల్మ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, స్వప్న సినిమాస్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ ‘చాంపియన్’ సినిమా డిసెంబరు 25న (Champion Movie Release date) థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. మిక్కీ.జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు దాదాపు రూ. 40 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ అయ్యిందనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.