Mowgli 2025 : ‘మోగ్లీ 2025’ సినిమా ఈ డిసెంబరు 13న థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. అంతకంటే ముం దుగా…ఈ డిసెంబరు 12న ఈ సినిమా ప్రీమియర్స్‌ను ప్రదర్శించనున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ…‘అఖండ 2’ (Akhanda 2) వంటి భారీ బడ్జెట్ సినిమాతో పాటుగా, ‘మోగ్లీ 2025’ సిని మా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అవుతుంది. అలాగే తెలుగు ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న కార్తీ ‘అన్నగారు’ చిత్రం కూడా డిసెంబరు 12నే థియేటర్స్‌లో విడుదల అవుతుంది. ఈ తరు ణంలో‘మోగ్లీ 2025’ టీమ్ ఓ సరికొత్త ఆలోచన చేసింది. ఆడియన్స్ దృష్టిని తమవైపు ఆకర్షిం చేందుకు, సినిమా టికెట్ ధరను రూ. 99కు తగ్గించింది.
ఇటీవలి కాలంలో సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్న కారణం తోనే, ఆడియన్స్ థియేటర్స్‌కు రావడం లేదనే ఓ వాదన ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అయితే రీ సెంట్‌గా విడుదలైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాను కొనుగోలు చేసిన బన్నీ వాసు, వంశీ నందిపాటిలు ఈ సినిమాను టికెట్‌ను రూ. 99 కే అందుబాటులోకి తెచ్చారు. సినిమా టాక్ కూడ బాగా ఉండటంతో, ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఫైనల్‌గా ఈ సినిమా కూడ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ‘మోగ్లీ 2025’ సినిమా టీమ్ కూడా రూ. 99లకే టికెట్ ధరను నిర్ణయించింది. ఈ టికెట్ ధరలకు కొంతమంది నిర్మాతలు వ్యతిరేకంగా ఉన్నారనే వార్తలూ ఉన్నాయి. కానీ తమ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో మోగ్లీ 2025 టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.
రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘మోగ్లీ 2025’ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, క్రుతీప్రసాద్‌లు నిర్మించారు. ఈ చిత్రానికి ‘కలర్‌ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హర్ష చెముడు, బండి సరోజ్‌కుమార్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
ఒకవేళ ‘మోగ్లీ 2025’ సినిమా రూ. 99 టికెట్ స్ట్రాటజీ వర్కౌట్ అయితే, ఈ దోవలో మరిన్ని చిత్రాలు వస్తాయని ఊహించవచ్చు.