Saitej Sambarala Yetigattu: సాయిధరమ్‌తేజ్ హీరోగా చేస్తున్న కొత్త సినిమాకు ‘సంబరాల ఏటి గట్టు’ (Sambarala Yetigattu) టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీతో కేపీ రోహిత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘హనుమాన్’ ప్రొడ్యూసర్స్ నిరంజన్‌రెడ్డి,చైతన్య రెడ్డి నిర్మాతలు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించి, ఎస్‌వైజీ (సంబరాల ఏటిగట్టు)–కార్నేజ్‌పేరిట ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోను బట్టి, ఈ సినిమా ఫుల్ మాస్ సినిమాలా కనిపిస్తోంది. డైలాగ్స్‌ని ‘సంబరాల ఏటి గట్టు’ సినిమా ప్యూర్ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను మేకర్స్ తీస్తున్నారు. దాదాపు 120 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను మేకర్స్ తీస్తున్నట్లుగా తెలిసింది. తన తొలిసినిమాకే ఈ స్థాయిలో బడ్జెట్ దక్కడం అనేది కేపీ రోహిత్‌కు సవాలే. ఎందుకంటే..సాయిధరమ్‌తేజ్ గత చిత్రం ‘విరూపాక్ష’. ఈ సినిమా టోటల్‌కలెక్షన్స్ వందకోట్ల రూపాయాలు. అలాంటిది ఇప్పుడే బడ్జెట్‌యే వందకోట్లు. అంటే…‘సంబరాల ఏటి గట్టు’ సినిమా ఇంకా భారీగా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓ కొత్త దర్శకుడిగా రోహిత్ ఎలా మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
మరోవైపు కొత్త దర్శకుడు, భారీ బడ్జెట్ అనుకుంటే…‘సంబరాల ఏటి గట్టు’ సినిమాను వచ్చే దసరా సందర్భంగా సెప్టెంబరు 25న రిలీజ్ చేస్తు న్నారు.కానీ ఇదే రోజు బాలకృష్ణ ‘అఖండ 2’ రిలీజ్ ఉంది. ‘అఖండ’ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో, ‘అఖండ2’పై అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో ‘అఖండ 2’తో పోటీ ఉంటే సాయిధరమ్‌తేజ్ ఓ సారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే బాలయ్య మార్కెట్ వేరు.సాయిధరమ్‌తేజ్ మార్కెట్ వేరు. మరో వారం రోజుల తర్వాత ‘కాంతార 2’ ఉంది. దీంతో ఇలా రిలీజ్ పరంగా కూడా సాయిధరమ్‌తేజ్ తన ఆలోచనలను మార్చుకోక పోతే బాక్సాఫీస్ వద్ద పెద్ద సవాల్‌కు సై అన్నట్లే.