Maa Inti Bangaram: హీరోయిన్‌గా సమంత చేస్తున్న సినిమాలు తక్కువైపోయాయి. అయితే సమంత (Samantha Next film) ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తున్నారు. సమంత లీడ్ రోల్‌లో నటిస్తూ, నిర్మి స్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram). ఈ పీరియాడికల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాను సమంత బర్త్ డే సందర్భంగా 2024, ఏప్రిల్ 28న అధికారికంగా ప్రకటించారు.
తాజాగా ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. సమంతతో ‘ఓ బేబీ’ వంటి హిట్ ఫిల్మ్ తీసిన దర్శకురాలు నందిని రెడ్డి, ‘మా ఇంటిబంగారం’ (Maa Inti Bangaram Movie) సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తొలుత ఈ సినిమాకు ఓ కొత్త దర్శకుడిని అనుకున్నప్పటకీని, ఫైనల్‌గా నందినీ రెడ్డి ఈ సినిమా కోసం మెగాఫోన్ పట్టారు. వీలైనంత తొందరగా, ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేయాలని సమంత అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట.
ఇక దర్శక–నిర్మాత రాజ్ నిడుమోరుతో సమంత రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్న వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత–రాజ్‌లు కలిసి దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకోవడం, ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చినట్లయింది.