హారర్ కామెడీ సినిమాలకు మంచి క్రేజ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఈ కోవలో రాబోతున్న మరో తెలుగు చిత్రం ‘శుభం’. ట్రాలాలా పిక్చర్స్ నిర్మాణసంస్థను ప్రారంభించి, ఈ సంస్థపై తొలి సినిమాగా ‘శుభం’ ( Shubham movie) సినిమాను తీశారు సమంత. ‘సినిమా బండి, పరదా (ఇంకా రిలీజ్ కాలేదు)’ చిత్రాల ఫేమ్ ప్రవీణ కండ్రే గుల ఈ సినిమాకు దర్శకుడు. లేటెస్ట్‌గా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. హారర్ ఎలిమెంట్స్‌తో వినోదాత్మకంగా ‘శుభం’ సినిమా ట్రైలర్ (Samantha Shubham movie trailer) కనిపిస్తోంది.
పీరియాడికల్ ఫిల్మ్ ఇది. ఓ గ్రామంలో ఉన్న మహిళలు అందరు రాత్రి తొమ్మిదిగంటలకు టీవీలో వచ్చే ఓ సీరియల్‌ను చూసి, వింత వింతగా దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తుంటారు. దీంతో ఆ ఊరి మగవాళ్ళు అంతా అక్కడ ఉన్న మాతాజీ (సమంత)ను ఆశ్రయిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా కథాంశంలా తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో ఒక్క డైలాగ్ చెప్పకుండ సమంత కనిపించడం, ఓన్టీ ఎక్స్ ప్రెషన్స్ తోనే ఉండటం..వంటి అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ మూవీలో హర్షిత్‌రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంత్తం, శ్రావణి లక్ష్మి, షాలిని కాండెపూడి, వంశీధర్ గౌడ్ లీడ్ రోల్స్ చేశారు. అంతా నూతన నటీనటులు. సమంత గెస్ట్ రోల్ చేశారు. షోర్ మ్యూజిక్ డైరెక్టర్. శుభం సినిమా మే 9న విడుదలకు రెడీ అవుతోంది. ఈ రోజునే….శ్రీవిష్ణు ‘సింగిల్’ మూవీ కూడా రిలీజ్‌కు రెడీ అయ్యింది.