Sanjay Leela Bhansali Meets AlluArjun: ‘పుష్ప’ ఫ్రాంచైజీ మూవీస్‌తో బాలీవుడ్‌లో తన సత్తా ఏంటో అల్లు అర్జున్ (బన్నీ) నిరూపించుకున్నాడు. ముఖ్యంగా ‘పుష్ప’ రెండో పార్టు ‘పుష్ప ది రూల్’ (pushpaTheRule) మూవీ హిందీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. చెప్పాలంటే హిందీలో ప్రస్తుతానికి అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రం ‘పుష్ప ది రూల్’ మూవీ. ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద రూ. 800 కోట్ల రూపాయాలకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది.
దీంతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బన్నీ స్టామినా ఏంటో తెలిపోయింది. దీంతో బాలీవుడ్ బడా దర్శకులు కూడా బన్నీతో మూవీ చేయడానికి రెడీ అయిపోయారు. అయితే ఈ టైమ్‌లో …ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీని, హీరో అల్లు అర్జున్ కలవడం చర్చనీయాంశమైంది. వీరి కాంబినేషన్‌లో మూవీ రావొచ్చనే టాక్ బాలీవుడ్‌లో ఊపందుకుంది.
Ramcharan Gamechanger Release: గేమ్‌చేంజర్ కాస్ట్‌లీ మిస్టేక్!
ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్, సందీప్‌రెడ్డి వంగాలతో అల్లు అర్జున్ సినిమాలు కమిటై ఉన్నాడు. సందీప్‌రెడ్డి వంగా ఆల్రెడీ ప్రభాస్ ‘స్పిరిట్’తో బీజీగా ఉండటం వల్ల, అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ దర్శకుడు త్రివిక్రమ్ తోనే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు సంజయ్‌లీలాభన్సాలీని బన్నీ కలవడంతో, త్రివిక్రమ్ కన్నా ముందే భన్సాలీతో బన్నీ మూవీ చేస్తాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Ramcharan Gamechanger: బ్రేక్ ఈవెన్‌కి గేమ్‌చేంజర్ ఎంత కలెక్ట్ చేయాలి?
అయితే సంజయ్‌లీలా భన్సాలీని అల్లు అర్జున్ కలవడం ఇది తొలిసారి కాదు..పుష్పది రూల్ రిలీజైన తర్వాత 2022 మార్చిలో తొలిసారిగా సంజయ్ లీలాభన్సాలీని కలిశాడు అల్లు అర్జున్. ఇప్పుడు మళ్లీ కలిశాడు. దీంతో వీరి కాంబినేషన్‌లోని మూవీ ఫిక్స్ అని ఊహింవచ్చు. అయితే అది ఎప్పుడు? అనే విషయంపై మాత్రం ఓ స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు రణ్‌బీర్‌కపూర్‌తో భన్సాలీ ‘లవ్ అండ్ వార్’ అనే మూవీ కమిటైయ్యాడు.
మరి..ఈ సినిమాను ముందుగా సెట్స్‌కు తీసుకుని వెళ్తాడా? లేక బన్నీతో మూవీ చేస్తాడా? అనేది చూడాలి.