Sankranthiki Vasthunam Hindi Remake: వెంకటేశ్ హీరోగా చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లోని ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరిలు హీరోయిన్స్‌గా నటించగా, ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించారు. కాగా, ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది (Sankranthiki Vasthunam Hindi Remake).
హిందీ రీమేక్‌లో అక్షయ్‌కుమార్ హీరో (Sankranthiki Vasthunam Hindi Remake Hero AkshayKumar)గా నటిస్తారు. అనీస్‌బాజ్మీ (Anees Bazmee) డైరెక్టర్. ‘దిల్’ రాజు, శిరిష్‌లు ఈ సినిమాను నిర్మిస్తారు. ఈ సినిమాలోని హీరోయిన్స్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా హిందీ రీమేక్ చిత్రీకరణను 2026లో ప్రారంభించి, 2026లోనే రిలీజ్ చేస్తా మని ‘దిల్’ రాజు చెప్పారు.
గతంలో ‘దిల్’ రాజు హిందీలో సినిమాలు చేశారు. రెండు హిందీ సినిమాలూ నిర్మించగా, రెం డూ చిత్రాలూ రీమేక్సే. నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమాను నిర్మాతలు అరవింద్, నాగ వంశీతో కలిసి ‘దిల్’ రాజు హిందీలో రీమేక్ చేశారు. ఇందులో షాహిద్‌కపూర్ హీరోగా నటిం చగా, మృణాల్‌ఠాకూర్ హీరోయిన్. ఓరిజినల్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరియే, హిందీ రీమే క్‌ను డైరెక్ట్ చేశారు. ఏమైందో ఏమో కానీ..ఈ హిందీ ‘జెర్సీ’ చిత్రం బాలీవుడ్ ప్లాఫ్ అయ్యింది.
అదే ఏడాది అంటే 2023లోనే తెలుగులో విశ్వక్‌సేన్ చేసిన హిట్ ఫిల్మ్ ‘హిట్’ను హిందీలో రాజ్‌కుమార్‌రావుతో రీమేక్ చేయగా, అదీ బ్లాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ‘దిల్’ రాజు, భూషణ్ కుమార్, క్రిషణ్‌కుమార్ ఈ సినిమాను నిర్మించారు. మరి…ఈ రెండు రీమేక్ బ్యాడ్ ఎక్స్‌పీరి యన్సెస్ తర్వాత మళ్లీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా రీమేక్‌ను హిందీలో చేస్తున్నారు ‘దిల్’ రాజు. మరి..ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ని ఇస్తుందో చూడాలి.