టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌కు సంక్రాంతి సీజన్ ఒక బాగా కలిసొచ్చింది. గతంలో ‘శతమానం భవతి’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లను సంక్రాంతి బరిలోనే అందుకున్న ఆయన, ఈ ఏడాది ‘నారి నారి నడుమ మురారి’ చిత్రంతో మళ్లీ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేశారు. భారీ పోటీ మధ్య విడుదలైనప్పటికీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తూ శర్వానంద్‌కు గట్టి కంబ్యాక్‌ను అందించింది. ఈ సక్సెస్ జోష్‌లో ఉన్న శర్వానంద్, తన తదుపరి సినిమాలపై కీలక అప్‌డేట్స్ ఇచ్చారు.
తనకు అచ్చొచ్చిన సంక్రాంతి సీజన్‌ను వదులుకోకూడదని శర్వా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 2027 సంక్రాంతికి ఒక భారీ చిత్రాన్ని తీసుకురాబోతున్నట్లు ఆయన ప్రకటించారు. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. తాజాగా జరిగిన నారీ నారీ నడుమ మురారి సక్సెస్ మీట్ లో స్వయంగా శర్వానంద్ ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయడం విశేషం. అంతేకాదు ఈ సినిమాను కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కి తీసుకురాబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. శ్రీను వైట్ల మార్క్ వినోదం, శర్వానంద్ నటన తోడైతే వెండితెరపై నవ్వుల పూయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం, జూన్ నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. కేవలం పండుగ సీజన్లే కాకుండా, వచ్చే ఏడాది (2026) కూడా శర్వానంద్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ సినిమా కంటే ముందే బైకర్, భోగి అనే ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాడు శర్వా. బైకర్ యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా. ఈ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటూ సంపత్ నందితో భోగి అనే ప్రాజెక్ట్ కి సైన్ చేసాడు. ఓ లఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇలా వరుస సినిమాలు చేస్తూ ఫామ్‌లోకి వచ్చిన శర్వానంద్, విలక్షణమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. ముఖ్యంగా శ్రీను వైట్లతో చేయబోయే సినిమాతో 2027 సంక్రాంతికి హ్యాట్రిక్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు.