హీరోయిన్ శ్రుతీహాసన్ (Shruti Haasan) రెండు సినిమాల నుంచి తప్పుకున్నారు. అడివి శేష్ (AdiviSesh) ‘డెకాయిట్’ (Docoit)అనే సినిమా చేస్తున్నారు. అడివి శేష్ హిట్ ఫిల్మ్స్ ‘క్షణం, గూఢచారి’ చిత్రాలకు కెమెరామెన్‌గా పని చేసిన షానీల్‌డియో ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అయితే ఈ సినిమాలో తొలుత హీరోయిన్‌గా శ్రుతీహాసన్‌ను తీసుకున్నారు మేకర్స్. కానీ శ్రుతీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో శ్రుతీ ప్లేస్‌లోకి మృణాళ్‌ఠాకూర్ వచ్చినట్లుగా తెలిసింది. సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్ కానుంది.
AkhilAkkineni: అఖిల్ చేయాల్సిన వందకోట్ల సినిమా క్యాన్సిల్?
విడిపోయిన ఇద్దరు ప్రేమికులు, కలిసి ఓ దొంగతనం చేయాల్సి వస్తుంది. ఆ అప్పుడు ఆ ఇద్దరు ఎలా దొంగతనం చేశారు? ఈ క్రమంలో వారు ఒకరిని మరొకరు మళ్ళీ మోసం చేసుకుంటారా? లేక కలిసి పోతారా? అనేది ‘డెకాయిట్’ సినిమా కథ అని తెలిసింది.
హాలీవుడ్ దర్శకుడు ఫిలిఫ్ జాన్ ‘అరెంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ సినిమాను రీమేక్ చేయాలనుకున్నాడు. తొలుత ఈ సినిమా కోసం సమంతను అప్రోచ్ అవ్వగా, సమంత ఒప్పుకున్నారు. కానీ మయోసైటిస్‌తో బాధపడు తున్న సమయంలో సమంత ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌లోకి శ్రుతీహాసన్ వచ్చారు. కానీ ఈ సినిమా ఇంకా మొదలు కాలేదు. మరో అప్‌డేట్ కూడా లేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.
మరోవైపు శ్రుతీహాసన్ ఇప్పుడు ‘కూలీ’ (Coolie) అనే సినిమాలో నటిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర, నాగార్జున, సత్యరాజ్, షౌబిన్ షాహిర్ కీలక పాత్ర దారులు. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్ కానుంది.