ఆ సినిమా ఫ్లాప్‌…అప్పు చేసి మరీ..రెమ్యూనరేష్‌ తిరిగి ఇచ్చేశా!

Viswa

Web Stories

Siddu Jonnalagadda: ‘డీజే టిల్లు’ సినిమాతో స్టార్‌ బాయ్‌గా ఎదిగారు సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda). ఆ తర్వాత ‘డీజే టిల్లు 2’ సినిమా రాగా, ఈ సినిమా కూడా సూపర్‌హిట్‌గా నిలిచింది. కానీ ‘డీజే టిల్లు 2’ తర్వాత సిద్దు జొన్నలగడ్డ చేసిన స్పై యాక్షన్‌ సినిమా ‘జాక్‌’. ఈ చిత్రంలో ‘బేబీ’ ఫేమ్‌ వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా నటించగా, బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 10న ఈ సినిమా విడు దలైంది. కానీ ‘జాక్‌’ సినిమాకు ఆడియన్స్‌ నుంచి సరైన రెస్పాన్స్‌ రాలేదు. దీంతో ‘జాక్‌’ (Jack)సినిమా భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌ నష్టాల పాలయ్యారు.

దీంతో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌ కలిసి ‘జాక్‌’ సినిమాకు సంబంధించిన ఎంతో కొంత సర్దుబాటు చేసి, నష్టాల భారాన్ని తగ్గించాలని కోరారు. ఆ సమయంలో ఈ చిత్రం హీరో సిద్దు జొన్నలగడ్డ రూ. 4.75 కోట్లను తిరిగి ఇచ్చేశారు. ఈ విషయంపై సిద్దు జొన్నలగడ్డ ఓ ఇంటర్వ్యూ వేదికగా మాట్లాడారు.

నా గత చిత్రం ‘జాక్‌’ సరిగా ఆడలేదు. ఎవరూ నష్టాల పాలవ్వకూడదని, రూ. 4.75 కోట్ల నా రెమ్యూనరేషన్‌ను తిరిగి ఇచ్చేశాను. ఈ రెమ్యూనరేషన్‌ను తిరిగి ఇవ్వడానికి నేను లోన్‌ తీసు కున్నాను. ఇప్పుడు ఈ లోన్‌ను తిరిగి ఇచ్చే పనిలోనే ఉన్నాను అని సిద్దు జొన్నలగడ్డ చెప్పారు.

ఇలా ఓ సినిమా నష్టాలపాలైన తర్వాత, ఓ హీరో స్పందించి, రెమ్యూనరేషన్‌ను తిరిగి ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం. ఈ విషయంలో సిద్దును మెచ్చుకోవాల్సిందే.

ఇక సిద్దుజొన్నలగడ్డ లేటెస్ట్‌ మూవీ ‘తెలుసు కదా’  (Telusukadha)చిత్రం ఈ దీపావళి సందర్భంగా విడుదల అవుతోంది. ఇందులో రాశీఖన్నా, శ్రీనిధిశెట్టిలు హీరోయిన్స్‌గా నటించారు. ఈ రొమాంటిక్‌ మ్యూజికల్‌ లవ్‌స్టోరీ సినిమాతో కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవు తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌లు ఈ సిని మాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం తమన్‌.

ఇక తెలుసు కదా సినిమాలో సరోగసీ పాయింట్‌ని, కాస్త సీరియస్‌గానే డీల్‌ చేశారట చిత్రంయూనిట్‌. త్వరలోనే ట్రైలర్‌ రానుంది. ఈ ట్రైలర్‌ విడుదల అయితే సినిమా కథనంపై మరింత స్పష్టత వస్తుంది.

Please Share
1 Comment
  • Выпадающие автопороги от производителя РФ ликвидируют задачи сохранения тепла и защиты от шума без образования порогов в проёме. Ищете выдвигающийся порог для пвх дверей? На smartporog.ru представлены модели LDM-01, LDM-02, LDM-03, LDM-04, LDM-05 и накладной LDM-07 по ценам от 611 рублей для межкомнатных, алюминиевых, пластиковых и противопожарных дверей. Smart-пороги ликвидируют продувание, потерю тепла, загрязнения и чужеродные ароматы, имеют противопожарные и антидымные характеристики, необходимы в медучреждениях, образовательных заведениях, торговых центрах и терминалах при эксплуатации каталок. Производство в России обеспечивает стабильные цены в рублях без привязки к валютным колебаниям.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos