దీపావళికి..తెలుసు కదా..లవ్‌యూ 2!

Viswa
Hero Sidhhu Jonnalagadda Telusukadha movie on Oct17

‘డీజే టిల్లు’ మూవీతో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ ఆ వెంటనే ‘జాక్‌: కొంచెం క్రాక్‌’ అంటూ ఆడియన్స్‌ ముందుకొచ్చాడు. కానీ ‘జాక్‌’ క్రాక్‌ కొంచెం ఎక్కువ కావడంతో ఆడియన్స్‌కు ఈ మూవీ ఎక్కలేదు. దీంతో సిద్దు జొన్నలగడ్డ కూడా కాస్త నిరుత్సాహ పడ్డాడు.

తాజాగా సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)నుంచి రాబోతున్న మూవీ ‘తెలుసు కదా’. డీజే టిల్లు, జాక్‌ చిత్రాలతో పోల్చినప్పుడు ‘తెలసు కదా’ (Siddu Jonnalagadda Telusu Kada)  సినిమా కాస్త డిఫరెంట్‌ జానర్‌ ఫిల్మ్‌. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ఇది (TelusuKada Movie). ఈ తరహా జానర్‌లో సిద్దును ఆడియన్స్‌ కాస్త మిస్సయ్యారు. ఆ మధ్య ‘కృష్ణ అండ్‌ హీజ్‌ లీల’ మూవీలో సిద్దు జొన్నలగడ్డ కాస్త రొమాంటిక్‌గా చేశాడు. కానీ తెలుసు కదా ఈ తరహా జానర్‌ మూవీ కూడ కాదు. ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ అని తెలుస్తుంది. రాశీఖన్నా, శ్రీనిధిశెట్టిలు ఈ మూవీలో హీరోయిన్స్‌గా యాక్ట్‌ చేస్తున్నారు.

ప్రముఖ స్టైలిస్ట్‌ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతీప్రసాద్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లేటెస్ట్‌గా ఈ తెలుసు కదా’ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. అదే అక్టోబరు 17న దీపావళి సందర్భంగా తెలుసు కదా సినిమా రిలీజ్‌ కాబోతుంది. తమన్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌. ‘జాక్‌’తో దెబ్బతిన్న సిద్దు మరి..‘తెలుసు కదా’ మూవీతోనైనా కాస్త కోలుకుంటాడో లేదో చూడాలి.

 

 

 

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *