సినిమా ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో నటుడిగా కొనసాగుతున్నా, ఆదిసాయికుమార్‌కు కెరీర్‌లో హిట్స్ చాలా తక్కువ. రీసెంట్‌గా ఆదిసాయికుమార్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి, ‘శంబాల’ అనే సినిమా చేశారు. యుగంధర్ ముని ఈ సినిమాకు దర్శకుడు. మరి..ఈ సినిమా ఆదిసాయికుమార్‌కు హిట్ ఇచ్చిందా? రివ్యూలో చదవండి.
కథ
1980లో శంబాల గ్రామంలో ఆకాశం నుంచి ఓ ఉల్క వచ్చి పడుతుంది. దీంతో ఆ గ్రామంలో వింత సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. ఆవు పొదుగు నుంచి పాలకు బదులు రక్తం వస్తుంది. ఊర్లో వరుసగా హత్యలు, ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ఇదంతా ఆ ఉల్క ప్ర భావం వల్లనేనని, ఆ గ్రామస్థులంతా నమ్ముతుంటారు. అయితే ఆ ఉల్కను గురించి, ఆరా తీసేందుకు ఢిల్లీ నుంచి విక్రమ్ (ఆదిసాయికుమార్) శంబాలకు వస్తాడు. విక్రమ్ నాస్తికుడు. దైవ శాస్త్రా లకన్నా, సైన్స్‌నే ఎక్కువగా నమ్ముతుంటాడు. మరోవైపు ఊర్లో ఉన్న సమస్యలకు శాస్త్రోత్కంగా పరిష్కారం కనుక్కోవాలని, ఆ ఊరి ప్రజలు, అక్కడి స్వామీజీలు ప్రయత్నిస్తుం టారు. వారి ప్రయత్నాలకు విక్రమ్ అడ్డుపడతాడు. దీంతో విక్రమ్‌కి, ఊరి ప్రజలకు గొడవులు అవుతంటాయి. మరి…ఆ తర్వాత ఏం జరిగింది? విక్రమ్‌కు ఎవరు హెల్ప్ చేశారు? శంబాల
ఊర్లో ఉన్న బండభూతం నేపథ్యం ఏంటి? ఊర్లో సమస్యకు విక్రమ్ ఎలా పరిస్కారం కనుక్కున్నాడు అన్నది మిగిలిన కథ
విశ్లేషణ
శివుడు, అంథకాసురుడు మధ్య యుద్ధం అంటూ చెప్పి, ‘శంభాల’ కథను మొదలుపెడతారు. ‘శంబాల’ గ్రామంలో జరిగే వింత సంఘటనలు, విక్రమ్ ఆ గ్రామానికి రావడం, బండభూతం వల్ల ఈ ఊర్లో జనాలు చనిపోవడం..ఇలా ఈ సినిమా తొలిభాగం సాగుతుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ ఫర్వాలేదు. బండభూతం నేపథ్యం, ఈ సమస్యకు విక్రమ్ పరిస్కారం కనుక్కోవడం వంటి సన్నివేశాలతో, ఈ సినిమా సెకండాఫ్‌లో సాగుతుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది. కానీ రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాలు చూసే ఆడియన్స్‌కు, ఈ ట్విస్ట్ పెద్ద థ్రిల్లింగ్‌గా అనిపించకపోవచ్చు. అయితే క్లైమాక్స్ తేలిపోయింది. ప్రీ క్లైమాక్స్‌లో ఉన్న ఎఫెక్టివ్‌నెస్ క్లైమాక్స్‌లోనూ కొనసాగితే బాగుండేది. కథపై ఆడియన్స్‌లో ఓవర్‌గా క్యూరి యాసిటీ క్రియేట్ చేసి, చివర్లో సింపుల్‌గా తేల్చేయడం స్క్రీన్ ప్లేలోని లోపంగా కనిపిస్తుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్
ఖగోళశాస్త్రవేత్తగా ఆదిసాయికుమార్ యాక్ట్ చేశాడు. యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ సీన్స్‌లో మంచి యాక్టింగ్ ప్రతిభను చూపించాడు. తన కంఫర్ట్‌జోన్‌దాటి, మంచి యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దేవిగా అర్చన అయ్యర్ నటన బాగుంది. కథలో చాలా కీలకంగా కనిపిస్తుంది. ఈ పాత్రకు సెకండాఫ్‌లో ఇంకాస్త హైలైట్ చేసి ఉండొచ్చు. రైతు రాములుగా రవివర్మ, కానిస్టేబుల్‌గా మధునందన్, మీసాల లక్ష్మణŠ , ఇంద్రనీల్‌ల యాక్టింగ్ ఈ సినిమాకు మరికొంత బలాన్ని ఇచ్చాయి. స్వసిక, శైలజా ప్రియ వారి వారి పాత్రల మేరకు యాక్ట్ చేశారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ ఈ సినిమాకు ఓ మెయిన్ ఫిల్లర్‌గా నిలిచింది. ఈ చిత్ర దర్శకుడు యుగంధర్ మంచి థ్రిల్లింగ్ కథ రాసుకున్నాడు. స్క్రీన్ ప్లేలో ట్రీట్‌మెంట్ ఇంకాస్త మెరుగ్గాఉండాల్సింది. ప్రీ ఇంట్రవెల్ సీన్స్ కాస్త నెమ్మదించడం, ఆది క్యారెక్టర్ ఇంట్రడక్షన్, బండభూతంల బ్యాగ్‌డ్రాప్ ఇంకాస్త బలంగా ఉండాల్సింది. విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు ఒకే.
ఫైనల్‌గా..: ఆది సాయి కుమార్కి కెరీర్ కు శంభాల రూపం లో ఓ రిలీఫ్ దక్కింది. హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌కు, ఓ డివోషనల్ టచ్ ఇచ్చి, శంభాల సినిమా తీశారు. ప్రజెంట్ ఈ జానర్ సినిమాలను ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రకారం ఆడియన్స్ ‘శంబాల’ సినిమాను ఓ సారి చూడొచ్చు. ఓవర్‌గా అంచనాలొద్దు. అంచనాలు లేకుండ వెళ్లి, చూస్తే శంబాల చిత్రం ఆడియన్స్‌ను మెప్పిస్తుంది.

Fala, apostadores! Tô buscando um app novo pra dar uns palpites e me indicaram o DonaldBetApp. Alguém usa? Acha que vale a pena baixar? Me contem! Se quiserem saber mais: donaldbetapp
Yo, shbetf has been pretty solid so far No complaints here The platform is smooth and the overall experience is pretty enjoyable Just my two cents shbetf
xIBgoFtzvvVORQaiCB
Pretty section of content. I just stumbled upon your site and in accession capital to assert that I acquire in fact enjoyed account your blog posts. Anyway I’ll be subscribing to your feeds and even I achievement you access consistently quickly.