అత్తర్లు రాసుకున్నా.పౌడర్లు పూసుకున్నా

Viswa
Pradeep Ranganathan Dude Movie Singari Song

Web Stories

Singari Lyrical Song: ‘లవ్‌టుడే, రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’ వంటి సినిమాలతో తమిళ దర్శక–నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కాగా ఈ యంగ్‌ హీరో చేస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘డ్యూడ్‌’. ఇందులో ‘ప్రేమలు’ ఫేమ్‌ మమితా బైజు హీరోయిన్‌గా నటించగా, రోహిణీ మొల్లెటి, హృదు హరూన్, ద్రవిడ్‌ సెల్వం ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. కీర్తీశ్వరన్‌ ఈ సినిమాకు దర్శకుడు.

మైత్రీమూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 17న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. లేటెస్ట్‌గా ఈ ‘డ్యూడ్‌’ సినిమా నుంచి ‘సింగారి సిన్న దానా..’ అనే పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ముందుగా తమిళ వెర్షన్‌ను విడుదల చేసి, ఆ నెక్ట్స్‌ తెలుగు వెర్షన్‌ను విడుదల చేశారు. తెలుగు వెర్షన్‌ పాటకు, రామ జోగయ్యశాస్త్రి లిరిక్స్‌ అందించగా, ఈ సినిమా మ్యూజిక్‌ డైరెక్టర్, సాయి అభ్యంకర్‌ పాడారు.

‘సింగారి సిన్నదానా నీ ఇంటి దారుల్లోనా పసోడై పాడుకోన..రింగా రింగా…’, ‘అత్తర్లు రాసుకున్నా…పౌడర్లు పూసుకున్న…ఊరిగి వస్తువున్నా…నీ కోసం కన్నా..’ అంటూ క్యాచీ, లిరిక్స్‌తో ఈ సాంగ్‌ శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది.

ఇక ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని రన్‌ చేస్తుంటారని, ఆ నెక్ట్స్‌ జరిగే సంఘటనలే ఈ సినిమా అని, ‘డ్యూడ్‌’ సినిమా కేవలం లవ్‌స్టోరీ మాత్రమే కాదు.. మాస్‌ మూమెంట్స్‌ కూడా ఉన్నాయని ఈ చిత్రం దర్శకుడు కీర్తీశ్వరన్‌ ఓ సందర్భంగా ఈ ‘డ్యూ డ్‌’ సినిమా గురించి చెప్పుకొచ్చారు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos