నవాబ్‌కేఫ్‌ మూవీ రివ్యూ

Viswa

Web Stories

సినిమా నవాబ్‌కేఫ్‌
నటీనటులు శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని, చైతన్య కృష్ణ
నిర్మాణం రాధా వి పపుడిప్పు
దర్శకుడు ప్రమోద్ హర్ష
ఎడిటింగ్‌ పవన్‌
సంగీతం ప్రశాంత్‌విహారి
కెమెరా క్రాంతి
నిడివి 2 గంటల 17 నిమిషాలు
రిలీజ్‌డేట్‌ ఫిబ్రవరి 20
రేటింగ్‌ 2/5

కథ
Nawab Cafe Movie Review: హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఉన్న నవాబ్‌కేఫ్‌ ఓనర్‌ రంగనాథం. తాతల నుంచి వారసత్వ ఆస్తిగా లభించిన ఈ కేఫ్‌ను రన్‌ చేస్తుంటాడు రంగనాథం. అతని కొడుకు రాజాకు మాత్రం నవాబ్‌కేఫ్‌ను రన్‌ చేయడం ఏ మాత్రం ఇష్టం లేదు. అమెరికా వెళ్లి, డబ్బులు బాగా సంపాదించాలని కలలు కంటుంటాడు. రాజా పెదనాన్న కొడుకు, వ్యాపారవేత్త కు మార్‌ ఈ కేఫ్‌ను ఎలాగైనా స్వాధీనం చేసుకుని, అక్కడ ఓ పెద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టాలని ప్లాన్‌ చేస్తాడు. అలా నవాబ్‌కేఫ్‌కు మంచి బేరం కుదురుతుంది. కానీ నవాబుకేఫ్‌ను అమ్మేందుకు రంగనాథం ససేమిరా ఒప్పుకోడు. ఈ విషయంలో తండ్రీకొడుకులు రంగనాథం-రాజాలకు మధ్యపెద్ద గొడవ జరుగుతుంది. మరి..ఆ తర్వాత ఏం జరిగింది? కుమార్‌ పన్నిన వలలో రాజా చిక్కుకున్నాడా? సఖీతో రాజా ప్రేమకథ సుఖాంతం అయ్యిందా? అన్న విషయాలను థియేటర్స్‌లోనే చూడాలి(Nawab Cafe  Review)

విశ్లేషణ

Nawabcafe Movie review in telugu
Nawabcafe Movie review in telugu

తండ్రీకొడుకుల ఎమోషన్‌ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. ఇలాంటి తరుణంలో మరోసారి ఈ జానర్‌ను టచ్‌ చేస్తున్నప్పుడు దర్శకుడు ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి. కనీసం టేకింగ్‌, స్క్రీన్‌ ప్లేలోనైనా. కానీ ఇందులో కొత్తదనం ఏమీ లేదు. తండ్రీకొడుకుల మధ్య ఉన్న సాధారణ ఎమోషనల్‌ డ్రామాగా ‘నవాబు కేఫ్‌’ సినిమా కథనం సాగుతుంది. హీరో రోటీన్‌బ్డీ కామెడీ, లవ్‌స్టోరీతో సినిమా చాలా నింపాదిగా సాగుతుంది. ఇంట్రవెల్‌ సమయంలో హీరో తండ్రి చనిపోవడంతో, సినిమా కాస్త ఎమోషనల్‌ టర్న్‌ తీసుకుంటుంది. ఇక్కడ్నుంచైనా దర్శకుడు కాస్త జాగ్రత్త పడాల్సింది. కానీ అదేం చేయలేదు. ఆడియన్స్‌ ఊహించగల సన్నివేశాలు, కొత్తదనం లేని కథనంతో ఓ రోటీన్‌ క్లైమాక్స్‌తో ఈ సినిమా కథనం సాగుతుంది.ముఖ్యంగా ధనుష్‌ ‘ఇడ్లీకొట్టు’ సినిమాను మళ్లీ చూస్తున్నట్లుగా ఉంటుంది. ఆ తర్వాత కీర్తీసురేష్‌ ‘మిస్‌ ఇండియా’, ‘ఉస్తాద్‌ హోటల్‌’ వంటి సినిమాలపై వేరే నటీనటులతో స్క్రీన్‌పై ప్రదర్శితం అవుతున్నట్లుగా ఉంటుంది.

హే బల్‌వంత్‌ సినిమా రివ్యూ

నటీనటులు-సాంకేతిక నిపుణులు

రాజాగా శివకందుకూరి బాగానే యాక్ట్‌ చేశాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో ఫర్వాలేదనిపించాడు. హీరోయిన్‌ సఖిగా తేజు రోల్‌కు కథలో సరైన ఇంపాక్ట్‌ లేదు. తన ఎక్స్‌పీరియన్స్‌ యాక్టింగ్‌తో రాజీవ్‌ కనకాల మంచి యాక్టింగ్‌ చేశారు. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌లో తనదైన మార్క్‌ చూపించారు. కుమార్‌గా చైతన్య ఉన్నంతలో ఓకే అన్నట్లుగా చేశాడు. కసిరెడ్డి కామెడీ కొన్ని చోట్లే నివ్వించింది. సాంగ్స్‌ యావరేజ్‌. ఆర్‌ఆర్‌ కూడా. ఎడిటింగ్‌ ఇంకాస్త కత్తెర వేయవచ్చు. ఫస్ట్‌హాఫ్‌లో ఇందుకు స్కోప్‌ ఉంది. ఎంచుకున్న పాయింట్‌ను ఆడియన్స్‌కు కొత్తగా చూపించడంలో దర్శకుడు పూర్తిస్థాయిలో సఫలం కాలెదెమో. నిర్మాణ విలువలు ఫర్వాలేదు.

 

తండ్రీకొడుకుల ఎమోషనల్‌ డ్రామా ఈ సినిమా. ఎమోషన్‌ కనెక్ట్‌ అవుతుంది. కానీ కథ కొత్తది కాకపోవడం, నెక్ట్స్‌ ఏం సీన్‌ రాబోతుందో ఆడియన్‌ ఊహించగలిగే అవకాశం ఉండటం,ల్యాగ్‌ సీన్స్‌ వంటివి సినిమాలో ఉన్నాయి.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi Shivani Nagaram