శివకార్తీకేయన్‌-సుధాకొంగర- శ్రీలీలల పరాశక్తి

Viswa
2 Min Read
శివకార్తీకేయన్‌ 25వ సినిమాకు పరాశక్తి సినిమా టైటిల్‌ ఖరారైంది. ఈ మూవీకి సుధాకొంగర దర్శకురాలు.

‘అమరన్‌’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో పుల్‌ జోష్‌లో ఉన్నారు హీరో శివకార్తీకేయన్‌ ( Sivakarthikeyan). ‘అమరన్‌’ తర్వాత ‘గురు, సూరారైపోట్రు (తెలుగులో ‘ఆకాశం నీ హద్దు రా)) వంటి హిట్‌ ఫిల్మ్స్‌ తీసిన దర్శకురాలు సుధాకొంగర (Sudhaతో శివకార్తీకేయన్‌ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు పరాశక్తి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 1960 నేపథ్యంతో సాగే ఈ పీరియాడికల్‌ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటించనున్నారు. రవి మోహన్‌ (జయం రవి), అథర్య ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తారు. స్టూడెంట్‌ లీడర్స్‌, స్టూడెంట్‌ యూనియన్స్‌, రాజకీయాలు వంటి అంశాల నేపథ్యంతో ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. శివకార్తీకేయన్‌ కెరీర్‌లోని ఈ 25వ సినిమాను డ్వాన్‌పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ‘పరాశక్తి’ సినిమా షూటింగ్‌ను జూలైలోపు పూర్తి చేసి, ఈ ఏడాదిలోనే మూవీని రిలీజ్‌ చేయాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తోన్నట్లుగా తెలుస్తోంది. ఇక హీరోయిన్‌ శ్రీలీలకు తమిళంలో ‘పరాశక్తి’ సినిమా తొలి మూవీ.

Sivakarthikeyan25: ముగ్గురు హీరోలు…ఒక హీరోయిన్‌ ఛేంజ్‌?

టైటిల్‌ విషయంలో వివాదం!

బిచ్చగాడు, సలీమ్‌, బిచ్చగాడు 2 వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన తమిళ హీరో విజయ్‌ ఆంటోనీ కొత్త సినిమాకు కూడా ‘పరాశక్తి’ అనే టైటిల్‌ ఖరారైంది. విజయ్‌ ఆంటోనీ కెరీర్‌లోని ఈ 25వ సినిమాకు అరుణ్‌ ప్రభు దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా ప్రారంభమైయ్యాయి. ఈ వేసవిలోనే రిలీజ్‌ కానుంది. అయితే పరాశక్తి సినిమా టైటిల్‌ తమదంటూ…ఇటు శివకార్తీకేయన్‌ టీమ్‌, అటు…విజయ్‌ ఆంటోనీ టీమ్‌లు..ఎవరికి వారు వారి ఆధారాలను, టైటిల్‌ రిజిస్ట్రేషన్‌కు చెందిన వివరాలను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. అయితే ఈ టైటిల్‌ వివాదం ఇంకా ఓ కొలిక్కి వచ్చినట్లుగా లేదు.

సూర్య చేయాల్సిన మూవీ

పరాశక్తి సినిమాను సుధాకొంగరు తొలుత హీరో సూర్యతో చేయాలనుకున్నారు. నటీనటులను కూడా ప్రకటించారు. కానీ క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వల్ల సూర్య ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత శివకార్తీకేయన్‌తో ‘పరాశక్తి’ సినిమాను చేస్తున్నారు సుధాకొంగర.

Share This Article
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *