Sookshmadarshini ott: మలయాళ బ్లాక్‌బస్టర్‌ సూక్ష్మదర్శని రివ్యూ

Viswa
3 Min Read
Sookshmadarshini Ott

Web Stories

కథ

పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే కుతుహాలం ఉన్న వ్యక్తిత్వం ప్రియదర్శినిది. ప్రియదర్శిని (నజ్రియా), ఆమె ఫ్రెండ్స్‌కి ఓ వాట్సప్‌ గ్రూప్‌ కూడా ఉంటుంది. ఎవరికి తెలిసింది వారు ఆ వాట్సప్‌ గ్రూప్‌లో షేర్‌ చేసుకుంటుంటారు. ఇక ప్రియదర్శిని (Nazriya) ఇంటికి దగ్గర్లో మాన్యూయేల్‌ కొత్తగా అద్దెకు వస్తారు. కానీ మాన్యుయేల్‌ ప్రవర్తన కాస్త వింతగా ఉన్నట్లుగా ప్రియదర్శిని గమనిస్తుంది. ఇంతలో మాన్యూయేల్‌ తల్లి గమనించకుండ పోతుంది. పోలీసులకు కంప్లైట్‌ ఇస్తారు. కానీ తన తల్లిని మాన్యూయేల్‌ (బాసిల్‌ జోసెఫ్‌) ఏ ఏదో చేశాడని, ప్రియ అనుమానిస్తుంటుంది. మాన్యూయేల్‌ (Basil Josef) వింత ప్రవర్తన వెనకాల ఉన్న అసలు నిజం ఏమిటి? మాన్యూయేల్‌ అమ్మ సడ న్‌గా ఎందుకు కనిపించకుండపోతుంది? మాన్యూయేల్‌ చెల్లి డయానా న్యూజిలాండ్‌ నుంచి ఎందుకు వస్తుంది? ప్రియకు– డయానాకుమధ్య ఉన్న జరిగిన వాట్సప్‌ కాన్వార్జేషన్‌ ఏంటి? అనేది సినిమాలో ఆసక్తికరంగా సాగుతుంది (Sookshmadarshini ott)

Ramcharan GameChanger Movie Review: రామ్‌చరణ్‌ గేమ్‌ఛేంజర్‌ మూవీ రివ్యూ

Wamiqa Gabbi

విశ్లేషణ

మలయాళ సినిమాలు (Sookshmadarshini ott) కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. అందుకే ఆడియన్స్‌ కూడా కొత్తరకం మల యాళ సినిమాల పట్ల ఆసక్తి చూపిస్తుంటారు. గతేడాది నవంబరులో విడుదలైన, సూక్ష్మ దర్శిని(Sookshmadarshini ott Release)  మూవీ బ్లాక్‌బస్టర్‌ కొట్టింది. కోర్‌ సస్పెన్స్‌ పాయింట్‌ ఇలా చిన్నది. కానీ ఆ పాయింట్‌తో దర్శకుడు కథ అల్లిన విధానం, క్లైమాక్స్‌ వరకు ఆడియన్స్‌లో సస్పెన్స్‌ క్రియేట్‌ చేయడం పట్ల దర్శకుడు దర్శకుడు ఎస్‌సీ జితిన్‌ సఫలం అయ్యాడు.

ramcharan: చరణ్‌పై ఇంత వ్యతిరేకతా?

కథ కొంచెం స్లోగా మొదలవుతుంది. కానీ ..మాన్యూయేల్‌ ఎంట్రీ వచ్చినప్పట్నుంచి కథ వేగం పుంజుకుంటుంది. ముగ్గురు మహిళల వాట్సఫ్‌ కన్వార్జేషన్స్, వారి ఫ్రెండ్‌షిఫ్‌ మహిళలకు సరదాగా అనిపిస్తుంది. ఇదే సమయంలో ప్రియ, ఆమె భర్త ఆంటోనీల మధ్య సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అవుతాయి. ముఖ్యంగా ప్రియ చెప్పిన దాన్ని, ఆమె స్నేహితులు నమ్మి, ప్రియకు సపోర్ట్‌ చేయడం అనేది కూడా బాగుంటుంది. మాన్యూయేల్‌ అమ్మ తప్పిపోవడంతో తొలిభాగం ముగిస్తే, మాన్యూయేల్‌ తిరిగి ఇంటికి ఎలా వచ్చారు? అనే ఓ సస్పెన్స్, దానికి వెనక ఉన్న ఓ క్రైమ్‌ డ్రామాతో కథ ముగుస్తుంది. క్లైమాక్స్‌ ఆడియన్స్‌ను సర్‌ ప్రైజ్‌ చేస్తుంది. అసలు మాన్యేయేల్‌ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని, అర్థరాత్రి వేళ ప్రియ అతని ఇంటి గోడపైకి ఎక్కడం, ఈ సీక్వెన్స్‌లో ఆమెకు తన స్నేహితులు హెల్ప్‌ చేయడం (గ్రూప్‌ ఫోన్‌ కాల్‌) సీక్వెన్స్‌ బాగుంటుంది. అయితే క్లైమాక్స్‌ సన్నివేశాలను కాస్త నిశితంగా పరిశీలించారు. లేకపోతే కోర్‌ పాయింట్‌ విషయంలో ఆడియన్స్‌ కన్‌ఫ్యూజ్‌ అయ్యే అవకాశం వచ్చింది.

 

DaakuMaharaaj Review: డాకుమహారాజ్‌ రివ్యూ

నటీనటుల పెర్ఫార్మెన్స్‌

క్యూరియాసిటీ ఉన్న గృహిణి పాత్రలో నజ్రియా (Nazriya) అదరగొట్టారు. భర్తతో గొడవ, మాన్యూయేల్‌ ఇంట్లో ఏం జరుగుతున్న ఆసక్తి, ఉద్యోగం చేయాలనే లక్ష్యం….ఇలా ప్రియదర్శిని పాత్రలో నజ్రియా సూపర్‌ఫెర్ఫార్మెన్స్‌ చేశారు. ఈ సినిమాకు ఆమె హీరో. మరో లీడ్‌ రోల్‌ మాన్యూ యేల్‌గా చేశారు బాసిల్‌ జోసెఫ్‌. బాగా యాక్ట్‌ చేశారు. క్యారెక్టర్‌లో కొంత నెగటివ్‌ షేడ్స్‌ కూడా కనిపిస్తాయి. నజ్రియా స్నేహితురాళ్లుగా అఖిలా భార్గవన్, మెరిన్‌ ఫిలిఫ్, పూజ మోహన్‌రాజ్‌లు యాక్ట్‌ చేశారు. కథలో వీరి పాత్రకు కూడా కీలకంగా ఉంటాయి. నజ్రియా భర్తగా దీపక్‌ ఉన్నంతో అలరించారు. ఈ పాత్రకు పెద్ద ఇంపార్టెన్స్‌ ఉండదు. సీనియర్‌ నటి గ్రాసీ రోల్‌ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తుంది. కథలో మాన్యూయేల్‌ పాత్రలో నటించింది గ్రాసీయే. క్రిస్టో జేవియర్‌ విజువల్స్, శరణ్‌ నాయర్‌ విజువల్స్‌ బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా ఉన్నంతలో ఫర్వాలేదు.

బాటమ్‌లైన్స్‌

డార్క్‌ కామెడీ, సస్పెన్స్‌ డ్రామాలను ఇష్టపడే ఆడియన్స్‌కు సూక్ష్మదర్శిని మూవీ కచ్చితంగా నచ్చుతుంది. అయితే క్లైమాక్స్‌ కొందరికి సాదాగా, మరికొంతమందికి గొప్పగా అనిపించవచ్చు. కానీ నజ్రియా యాక్టింగ్‌, బాసిల్‌ జోసెఫ్‌ల పెర్ఫార్మెన్స్‌ల కోసం ఓ సారి చూడొ చ్చు. డిస్నీ ఫ్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

రేటింగ్‌: 2.75/5

Please Share
6 Comments
Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos