శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’ సినిమా ఫస్ట్‌ రివ్యూ

Viswa
Vishnu Vinyasam Movie First Review

Web Stories

Vishnu Vinyasam First Review: ‘సామజవరగమన, సింగిల్‌’ వంటి సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఎంటర్‌టైనింగ్‌ జానర్‌లో శ్రీవిష్ణు చేసిన సినిమాలు ఇవి. ఇదే జానర్‌లో శ్రీవిష్ణు నుంచి వస్తున్న మరో ఎంటర్‌టైనింగ్‌ మూవీ ‘విష్ణు విన్యాసం’. ఈ మూవీలో నయన్‌సారిక హీరోయిన్. యథునాద్‌ మారుతీరావు దర్శకుడు. సుమంత్‌ జి.నాయుడు నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 27న (Vishnu Vinyasam Movie Release date)రిలీజ్‌కు సిద్ధమైంది. మరి..ఈ మూవీ ఎలా ఉండబోతుంది? అన్న అంశాలపై మీరు ఓ లుక్‌ వేయండి….

Vishnu Vinyasam Story: ఒంగోలు పట్టణం నేపథ్యంలో రూపొందిన సినిమా ‘విష్ణు విన్యాసం’. ఈ చిత్రంలో విష్ణు అనే పాత్రలో శ్రీవిష్ణు, మనీషా అనే పాత్రలో హీరోయిన్‌ నయన్‌సారిక యాక్ట్‌ చేశారు. ఒకే కాలేజీలో శ్రీవిష్ణు, మనీషాలు లెక్చరర్స్‌. మనీషా మ్యాథ్స్ లెక్చరర్‌. ఒకే కాలేజీలో లెక్చరర్స్‌ కావడం వల్ల విష్ణు-మనీషాలు ప్రేమలో పడతారు. కానీ విష్ణుకి జాతకాల పిచ్చి. ఈ జాతకాల పిచ్చితో తన చుట్టు ఉన్న ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌ను ఇబ్బంది పెడుతుంటాడు. ఇలాంటి జాతకాల పిచ్చి ఉన్న విష్ణు లైఫ్‌లోకి ఓ అమ్మాయి వస్తే ఏం జరుగుతుంది? అన్నదే ఈ సినిమా కథనం. అలాగే మనీషా క్యారెక్టరైజేషన్స్‌లోని డిఫరెంట్‌ షేడ్స్‌ కథను మలుపులు తిప్పుతుంటాయి. వీటిని థియేటర్స్‌లో చూడాలి.

Sree Vishnu Vishnu Vinyasam Movie First Review

టీజర్‌, ట్రైలర్‌ కంటెంట్‌ చూస్తుంటే…హీరోయిన్‌ను హీరో ప్రేమించడం కోసం కష్టాలు పడటం, ఆ తర్వాత హీరోయిన్‌కు ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్‌ వల్ల..అసలు ఎందుకు ప్రేమలో పడ్డానని హీరో బాధపడటం, ఆ తర్వాత హీరో-హీరోయిన్ల లవ్‌స్టోరీకి ఓ శుభం కార్డు పడటం…వంటి విజువల్స్‌తో ‘విష్ణు విన్యాసం’ సినిమా కథనం సాగుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలో వచ్చే కామెడీ సీన్స్‌, ఇంట్రవెల్‌ ట్విస్ట్‌, సెకండాఫ్‌ ఎమోషన్స్‌తో సినిమా ముగుస్తుంది. గత ఏడాది కిరణ్‌ అబ్బవరం ‘కె-ర్యాంపు’ సినిమా బేస్‌ స్టోరీలైన్‌కి ‘విష్ణు విన్యాసం’ స్టోరీ లైన్‌ కాస్త దగ్గరుగా ఉంటుందని ఊహించవచ్చు. అలాగే ఈ సినిమా కథ లెక్చరర్స్‌ లవ్‌స్టోరీగా మొదలైన, ఈ సీన్స్‌ కొంత సమయం వరకే ఉంటాయని, ఆ తర్వాత కథ హీరో హీరోయిన్ల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్తుంది. స్క్రీన్‌ ప్లే ఇలానే ఉంటుందట.

స్టోరీలైన్‌ కాస్త రోటన్‌గా ఉన్నా, విష్ణు కామెడీ టైమింగ్‌, డైలాగ్‌ డెలివరీ, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ…ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నట్లుగా తెలుస్తుంది. రథన్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ అందించాడు. సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణలు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు (Vishnu Vinyasam Movie Cast and Crew).

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi Shivani Nagaram