Sreeleela: రామ్ ‘స్కంధ’, నితిన్ ‘ఎక్స్ ట్రా: ఆర్డినరీమేన్, వైష్ణవ్‌తేజ్ ‘ఆదికేశవ’..ఇలా వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడ్డారు శ్రీలీల. దీంతో శ్రీలీలకు మెల్లిగా అవకావాలు సన్నగల్లాయి. కానీ ‘పుష్ప ది: రూల్’లో శ్రీలీల (Sreeleela) చేసిన ‘కిస్సిక్’ సాంగ్ ఆమె కెరీర్‌కు మంచి ఊపునిచ్చినట్లుంది. ఎందుకంటే… హీరోయిన్ శ్రీలీల చేతిలో ప్రస్తుతం 7 సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
‘ఎక్స్‌ట్రా’ తర్వాత హీరో నితిన్‌తో శ్రీలీల మళ్లీ ‘రాబిన్‌హుడ్’ సినిమా చేశారు. వెంకీకుడుముల దర్శ కత్వంలోని ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్‌కు రెడీ అవుతోందని తెలిసింది. ‘ధమాకా’ వంటిహిట్ ఫిల్మ్ తర్వాత శ్రీలీల మళ్లీ రవితేజతో ‘మాస్ జాతర’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం మేలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. పవన్‌కల్యాణ్‌తో హరీష్‌శంకర్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా చేయాల్సి ఉంది. వచ్చేఏడాది ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందని తెలిసింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తారు.అలాగే శివకార్తీకేయన్ హీరోగా సుధాకొంగర దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఈ చిత్రంలో శ్రీలీలహీరోయిన్‌గా చేస్తారు. ఆల్రెడీ డిసెంబరు 14న, ఈ సినిమా ఓపెనింగ్ కూడా జరిగిపోయింది.

Nandamuri Balakrishna Akhanda2: అఖండ 2 రిలీజ్ ఫిక్స్..కాంతారతో పోటీ
ఇవి కాకుండ ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ వర్మ దండుతో నాగచైతన్య ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలోశ్రీలీల హీరోయిన్‌గా నటిస్తారని సమాచారం.అలాగే సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేయాల్సిన సినిమాలో హీరోయిన్ శ్రీలీల కన్ఫార్మ్ అయిపోయారని సమాచారం. శ్రీలీల జోరు ఇంతటితో ఆగలేదు. అఖిల్‌హీరోగా కిరణ్ (వినరోభాగ్యము విష్ణుకథ ఫేమ్)తో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యారని తెలిసింది.