Star music directors for bloody Romeo: టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న నాని, ‘ఓజీ’తో తన స్టైలిష్ టేకింగ్ పవర్‌ను నిరూపించుకున్న సుజీత్.. వీరిద్దరి కలయికలో వస్తున్న ప్రాజెక్ట్ ‘బ్లడీ రోమియో’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా మ్యూజిక్ విషయంలో సుజీత్ తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా ఏ సినిమాకైనా ఒకరే సంగీత దర్శకుడు ఉండటం కామన్. కానీ ‘బ్లడీ రోమియో’ కోసం సుజీత్ ‘మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్’ కాన్సెప్ట్‌ను ట్రై చేయబోతున్నారట. కథలో ఉండే విభిన్న ఎమోషన్స్, జానర్లకు అనుగుణంగా ఇద్దరు లేదా ముగ్గురు కంపోజర్లను రంగంలోకి దించాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమాలో ఉండే ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లకు, ఎమోషనల్ డ్రామాకు వేర్వేరు సంగీత
శైలీలు అవసరమని సుజీత్ భావిస్తున్నారట. పాటలకు ఒకరు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కు మరొకరు..
లేదా డిఫరెంట్ జానర్ సాంగ్స్ కోసం వేర్వేరు ట్యూన్ మేకర్లను ఎంచుకోవడం ద్వారా సినిమాకు ఒక ‘ఫ్రెష్’ ఫీల్ తీసుకురావాలన్నది చిత్ర యూనిట్ ఆలోచన. నాని సినిమాల్లో మ్యూజిక్ ఎప్పుడూ ఒక ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. అయితే, తన కెరీర్‌లో ఒకే సినిమాకు ఇంతమంది సంగీత దర్శకులు పనిచేయడం నానికి ఇదే తొలిసారి కానుంది. సుజీత్ మేకింగ్‌లో సౌండ్ డిజైనింగ్ చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి, ఈ సరికొత్త ప్రయోగం సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. త్వరలోనే ఈ మ్యూజికల్ టీమ్ గురించి మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కాగా ఇటీవల నాని బర్త్ డే సందర్బంగా రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ టీజర్ చాలా స్టైలిష్‌గా ఉండి అందరినీ ఆకట్టుకుంది. త్వరలోనే చిత్ర యూనిట్ హీరోయిన్, మిగిలిన నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.