ధనుష్ తో పెళ్లి.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన మృణాల్..!

Kumar NA
2 Min Read

Web Stories

కోలీవుడ్ స్టార్ ధనుష్, ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఎట్టకేలకు తెరపడింది. ముఖ్యంగా ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14న) వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే ప్రచారంపై మృణాల్ బృందం అధికారికంగా స్పందించింది. గత ఏడాది కాలంగా ధనుష్, మృణాల్ డేటింగ్‌లో ఉన్నారనే ఊహాగానాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి (Dhanush Mrunal Thakur marriage rumours).

ధనుష్ హాజరైన బాలీవుడ్ పార్టీలలో మృణాల్ కనిపించడం, అలాగే మృణాల్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ఈవెంట్‌కు ధనుష్ అతిథిగా రావడం వంటి పరిణామాలు ఈ అనుమానాలకు బలాన్నిచ్చాయి. అప్పట్లో వీరు ఈ వార్తలను ఖండించకపోవడంతో, పెళ్లి వార్త నిజమేనని అందరూ భావించారు. వరుస కథనాల నేపథ్యంలో మృణాల్ ఠాకూర్ ప్రతినిధులు ఈ వార్తలను పూర్తిగా కొట్టిపారేశారు. “వచ్చే నెలలో ధనుష్‌ను మృణాల్ పెళ్లి చేసుకుంటున్నారన్న వార్తల్లో ఇసుమంతైనా నిజం లేదు. అవన్నీ నిరాధారమైన పుకార్లు” అని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె తన కెరీర్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించారని, పెళ్లి చేసుకునే ఆలోచన ఇప్పుడప్పుడే లేదని తెలిపారు (Dhanush marriage latest updates). మృణాల్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారని, ఆ డేట్స్ చూస్తేనే ఆమెకు తీరిక లేదని అర్థమవుతోందని ఆమె బృందం పేర్కొంది (Dhanush Mrunal wedding news).

ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం ‘దో దివానే షెహర్ మే’ విడుదల కానుంది. అడివి శేష్‌తో కలిసి నటిస్తున్న క్రేజీ తెలుగు ప్రాజెక్ట్ ‘డెకాయిట్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాల ప్రమోషన్లు మరియు షూటింగ్స్ మధ్య పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పారు. మొత్తం మీద ధనుష్-మృణాల్ వివాహం అనేది కేవలం సోషల్ మీడియా సృష్టించిన ఊహేనని తేలిపోయింది. మృణాల్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆమె రాబోయే ‘డెకాయిట్’ చిత్రం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు (Dhanush Mrunal Thakur relationship rumours).

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi