సన్నీ డియోల్‌ ‘జాట్‌’ మూవీ రివ్యూ

Viswa
4 Min Read
Sunney deol Jaat Telugu Review

సినిమా: జాట్‌ (Sunny deol Jaat Movie Telugu Review)
ప్రధానతారాగణం: సన్నీ డియెల్, రణ్‌దీప్‌ హుడా, వినీత్‌కుమార్‌ సింగ్, రెజీనా కసాండ్రా, సయామీ ఖేర్, రమ్యకృష్ణ, జగపతిబాబు
దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని
నిర్మాణం: నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్‌
మ్యూజిక్‌: తమన్‌
ఎడిటర్‌: నవీన్‌ నూలి
కెమెరా: రిషీ పంజాబీ
విడుదల: ఏప్రిల్‌ 10, 2025

శ్రీలంక నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లాలోని మొట్టుపల్లికి వచ్చి, అక్కడి చుట్టు పక్కల గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటాడు రణతుంగ (రణదీప్‌ హుడా). రణతుంగ సోదరుడు సోములు (వినీత్‌ కుమార్‌ సింగ్‌) అతనికి మరో బలం. వీరి అరాచకాలు, ఆకృత్యాలు, విధ్వంసం, మారణకాండలకు అడ్డే లేకుండా పోతుంది. అయితే ఓ సందర్భంగా రణతుంగ గ్యాంగ్‌ సభ్యులతో బల్బీర్‌ ప్రతాప్‌ సింగ్‌ గొడక పడతాడు. తనతప్పు లేనందుకు రణతుంగ గ్యాంగ్‌ మెంబర్స్‌ నుంచి సారీ అడుగుతాడు బల్బీర్‌ ప్రతాప్‌. ఈ చిన్న విషయం కాస్త పెద్ద గొడవ అయిపోతుంది. దీంతో రణతుంగను బల్బీర్‌ను ఫేస్‌ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏం జరిగింది? అసలు..రణతుంగ శ్రీలంక నుంచి ప్రకాశం జిల్లాకే ఎందుకు వచ్చాడు? బల్బీర్‌కు, రణతుంగకు ఉన్న పాత వైరం ఏమిటి? ఈ గ్రామల ప్రజలను బల్బీర్‌ ఎలా కపాడాడు? ఈ క్రమంలో అతనికి ఎదరైన సవాళ్లు ఏమిటి? ఇందులో సీబీఐ ఎందుకు ఇన్‌వాల్వ్‌ అయ్యింది? అన్నది ‘జాట్‌’ కథ (Jaat Review)

‘గదర్‌ 2’ వంటి భారీ బాక్సాఫీస్‌ సక్సెస్‌ తర్వాత తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేనితో మూవీ చేశాడు బాలీవుడ్‌ సీనియర్‌ హీరో సన్నీ డియోల్‌. రీసెంట్‌ టైమ్స్‌లో దక్షిణాది సినిమాలను ఉత్తరాది ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. బాక్సాఫీస్‌ వద్ద కాసలు వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు రీసెంట్‌గా అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ సినిమా సక్సెస్‌నే ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

మాస్‌ కమర్షియల్‌ సినిమాలు తీయడంలో గోపీచంద్‌ మలినేని కూడా హిట్‌ డైరెక్టర్‌యే. రవితేజతో క్రాక్, బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి’ సినిమాలను తీశాడు గోపీచంద్‌ మలినేని. సన్నీ డియోల్‌తోనూ ఇదే ఫార్ము లాను స్టార్ట్‌ వర్కౌట్‌ చేశాడు గోపీచంద్‌. తెలుగు కమర్షియల్‌ టెంప్లెట్‌ మూవీ కథతో సినిమా చేశాడు. ఇది నార్త్‌ వాళ్లకు నచ్చొచ్చు. కానీ దక్షిణాది ఆడియన్స్‌ మాత్రం..ఇలాంటి సినిమాలు చాలనే చూశారు. బోయపాటి డైరెక్షన్‌లోని మూవీస్, బాలకృష్ణ సినిమాలు చాలానే ఉన్నాయి.

తీరప్రాంత గ్రామాల్లోని ఖనిజ సంపద దోపిడీకి, కార్పొరేట్‌ సంస్థలు ఎలాంటి పన్నాగాలు, కుట్రలు చేస్తాయన్నదే క్లుప్తంగా ఈ సినిమా కథ. గోపీచంద్‌కు కాస్త ప్రాంతీయ అభిమానం ఎక్కుగా ఉన్నట్లే ఉంది. రవితేజ క్రాక్‌ సినిమాను ప్రకాశం జిల్లా ఒంగోలు బ్యాక్‌డ్రాప్‌లో తీశాడు. తన బాలీవుడ్‌ తొలి మూవీ కథను కూడా ప్రకాశం జిల్లాతోనే ముడిపెట్టాడు (గోపీచంద్‌ స్వస్థలం ప్రకాశం జిల్లా).

రణతుంగ మారణకాండ సన్నివేశాలు, హీరో ఎంట్రీ వంటి సీన్స్‌తో తొలిభాగం ఫటాఫట్‌ –ధనాధన్‌ అన్నట్లుగా సాగుతుంది. కానీ సెకండాఫ్‌ మాత్రం అలా కాదు. ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ కూడా ఉంటుంది. ఇంట్రవెల్‌ తర్వాతి సీన్స్‌ ఇంకాస్త గ్రిప్పింగ్‌గా ఉండాల్సింది. ఆడియన్స్‌ సహనాన్ని పరీక్షించకుండ.

సన్నీ డియోల్, రణదీప్‌ హుడాల మధ్య వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్‌ సీక్వెన్స్‌లు ఆడియన్స్‌కు ఫర్వాలేద నిపిస్తాయి. సెకండాఫ్‌లో వచ్చే పోలీస్‌ స్టేషన్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ బాగుంటుంది. ఇక మాస్‌ సినిమాలకు ఆర్‌ఆర్‌ ఇవ్వడంలో సిద్ధహస్తుడైన తమన్‌ మరోసారి తన సౌండ్‌ను గట్టిగా వినిపించాడు. కానీ ఇది సినిమాకు కొన్నిచోట్ల మాత్రమే ఫ్లస్‌ అయ్యింది.

తలలు నరికే మితిమిరిన హింసాత్మక సన్నివేశాలు, ముఖ్యంగా లేడీ పోలీసుల సన్నివేశం, బలవంతంగా భావోద్వేగాలను రుద్దే ప్రయత్నం చేయడం, భారీ భారీ సన్నివేశాల మధ్య ఓ చిన్నపాటి రిలీఫ్‌ ట్రాక్‌ (కామెడీ తరహా లాంటిది) లేకపోవడం వంటివి ‘జాట్‌’ సినిమాను చూసే ఆడియన్స్‌ను ఇబ్బందిపెట్టేవే. హీరో బ్యాక్‌స్టోరీ కూడా ఓపిగ్గా చూడాల్సిందే.

బ్రిగేడియర్‌ బల్భీర్‌ ప్రతాప్‌ సింగ్‌ గా సన్నీ డియోల్‌ యాక్టింగ్‌ బాగుంది. అదే..మాస్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఫర్వాలేదు. నా చేతి పవర్‌ సత్తా ఏంటో ఆల్రెడీ నార్త్‌ చూసింది..ఇప్పుడు సౌత్‌ కూడా చూస్తుంది..అని బల్భీర్‌ ప్రతాప్‌సింగ్‌గా సన్నీ డైలాగ్‌ చెప్తాడు సినిమాలో. కానీ…ఇతకంటే పవర్‌ఫుల్‌ హ్యాండ్స్‌ని సౌత్‌ స్క్రీ¯Œ ఇక్కడి ఆడియన్స్‌కు ఎప్పుడో చూపించేసింది. మెయిన్‌ విలన్‌ రణతుంగగా రణదీప్‌ హుడా బాగానే చేశాడు.
వీరిద్దరి మాస్‌ ఎమోషన్సే కాబట్టి..యాక్టింగ్‌కు పెద్ద స్కోప్‌ లేదు. మరో విలన్‌గా వినీత్‌కుమార్‌ సింగ్‌ కనిపిస్తాడు. ఇంకో విలన్‌ రోల్‌ రామ సుబ్బారెడ్డిగా అజయ్‌ ఘోష్‌ చేశాడు. రణతుంగ భార్య భారతిగా రెజీనా చేశారు. ‘విడాముయర్చి’ సినిమాలో ఉన్నట్లే…ఈ సినిమాలోనూ రెజీనా క్యారెక్టర్‌లో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయి. పోలీసాఫీసర్‌ విజయలక్ష్మిగా సయామీ ఖేర్‌ ఒకే. జగపతిబాబు, రమ్యకృష్ణ, మురళీ శర్మ, మకరంద్‌దేశ్‌ పాండే, ఉపేంద్ర లిమా (సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌)…వంటి వాళ్లు వాళ్ల వాళ్ల పాత్రల మేరకు చేశారు. ఇక ఇన్ని పాత్రల మధ్య కూడా ఉర్వశీ రౌతెలాతో స్పెషల్‌ సాంగ్‌ చేయించాడు దర్శకుడు గోపీచంద్‌ మలినేని.

కథను ఇంకాస్త బలంగా రాసుకోని ఉండాల్సింది గోపీచంద్‌ మలినేని. యాక్షన్‌ సీక్వెన్స్, ఎలివేషన్స్‌పై పెట్టిన దృష్టి, కథలో నాటకీయతపై కూడా ఉంటే బాగుండేది. మైత్రీ నిర్మాణవిలువలు బాగానే ఉన్నాయి. కానీ ఈ సినిమాను హిందీతో పాటు తెలుగులో కూడా ఒకేసారి ఎందుకు రిలీజ్‌ చేయలేదో అర్థం కానీ ప్రశ్న. తమన్‌ మ్యూజిక్‌ ఒకే. ఆర్‌ఆర్‌ మరోసారి ఇరగొట్టాడు. విజువల్స్‌ ఒకే. సెకండాఫ్‌లో కొత్త కట్‌ చేయవచ్చు.

బాటమ్‌ లైన్‌: జాట్‌..స్ట్రిక్ట్‌లీ యాక్షన్‌ లవర్స్‌
రేటింగ్‌ 2.5/5

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *