చూస్తుంటే ఈ ఏడాది ప్రభాస్ సినిమా ఏదీ థియేటర్స్‌లో విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం ‘రాజాసాబ్ (TheRajaSaab Release), ఫౌజి’ సినిమాల చిత్రీకరణలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. మారుతి డైరెక్షన్‌లోనిఈ హారర్ కామెడీ ఫిల్మ్ ‘రాజాసాబ్’ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. దీంతో ప్రభాస్ నుంచి నెక్ట్స్‌థియేటర్స్‌లోకి రాబోయే మూవీ ‘రాజాసాబ్’ (TheRajaSaab) నే అని, ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ రాజాసాబ్‌మూవీ ఈ ఏడాది థియేటర్స్‌లోకి వచ్చే చాన్సెస్ తక్కువే అని చెప్పాలి.
రాజాసాబ్ షూటింగ్ బ్యాలెన్స్
‘రాజాసాబ్’ సినిమా చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. మేజర్ టాకీ పార్టు పూర్తయినప్పటికీని, సాంగ్స్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఎలాగూ ఈ సాంగ్స్‌ను పూర్తి చేసేద్దామనుకున్నా…ఈ సినిమాకు స్ట్రాంగ్ వీఎఫ్‌ఎక్స్ చేయాల్సి ఉంది. షూటింగ్ పూర్తి అయితే కానీ, ఈ చిత్రం దర్శకుడు మారుతి పోస్ట్ ప్రొడక్షన్స్‌పై పూర్తిగా దృష్టిసారించలేని పరిస్థితి. పైగా ఈ చిత్రం కోసం ఇటీవల యూనిట్ చిత్రీకరించిన ఓ యాక్షన్ సీక్వెన్స్ పట్ల ప్రభాస్ అసంతృప్తిగా ఉన్నారట. ఈ సీక్వెన్స్‌ను మళ్లీ షూట్ చేయాలంటే…పది కోట్ల వరకు ఖర్చు అవుతుందట. ఇంత మొత్తాన్ని రీ షూట్‌కు కేటాయించే స్థితిలో ఈ చిత్రం నిర్మాత టీజీ విశ్వప్రసాద్ లేరు. దీంతో ఈ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొని ఉంది.
పోనీ…‘ఫౌజి’ సినిమా ఈ ఏడాది థియేటర్స్‌లో వస్తుందనుకుంటే…ఆ చాన్స్ లేదు. ఈ సినిమా షూటింగ్ ఇంకా చేయాల్సి ఉంది. భారీ వీఎఫ్‌ఎక్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి…ఈ సినిమా 2025లో రిలీజ్ కానే కాదు.. ఇక రాజాసాబ్ సినిమాయే, 2026 ప్రధమార్థంలో రిలీజ్ కావొచ్చు. అన్నీ సవ్యంగా సాగితే..!
Hero Prabhas: విలన్‌గా ప్రభాస్?
ప్రభాస్ బిజీ బిజీ!
మరోవైపు ప్రభాస్ ‘ఫౌజి’, ‘స్పిరిట్’, చిత్రాలతో పాటుగా, హోంబలే ఫిలింస్ సంస్థతో ప్రభాస్ మూడు సినిమాలు కమిటైయ్యారు. ఈ మూడు చిత్రాల్లో ఒకటి ‘సలార్ 2’, కాగా…ఒకటి లోకేష్ కనగరాజ్‌తోఉంటుంది. మరోకటి ప్రశాంత్ వర్మతో ఉంటుంది. ఇలా వరుస సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉంటారు.
టాప్ స్టార్స్ రానట్లేగా!
అల్లు అర్జున్, మహేశ్‌బాబు సినిమాలు ఎలాగూ ఈ ఏడాది థియేటర్స్‌లోకి రావు. ఇప్పుడు ఈ కోవలో ప్రభాస్ కూడా చేరినట్లుగా తెలుస్తోంది. ఇలా ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు థియేటర్స్‌లోకి రాకపోవడం అనేది తెలుగు సినీ ఫ్యాన్స్‌ను నిరాశపరిచే అంశమనే చెప్పవచ్చు.