please subscribe to Tollywoodhub YouTube channel

ఆ మాటే పొరబడి విన్నానా..!

Viswa

Web Stories

ThimmarajuPalli TV Movie: హీరో కిరణ్‌ అబ్బవరం నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ (ThimmarajuPalli TV Movie). ఈ చిత్రంలో సాయితేజ్, వేద జలంధర్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రదీప్‌ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యానారాయణ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. వి.మునిరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఈ నెల 17న (ThimmarajuPalli TV Movie Release date) థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

దీంతో ఈ పీరియాడికల్‌ విలేజ్‌ డ్రామా సినిమా నుంచి ‘నిజమేనా..’ పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. సంగీత దర్శకుడు వంశీకాంత్‌ రేఖన స్వరకల్పనలో, సనరే లిరిక్స్‌ రాయగా, జయశ్రీ పల్లెం పాడారు

‘నిజమేనా నిజమేనా నే విన్నది నిజమేనా…, నువు పలికిన ఆ మాటే పొరబడి విన్నానా… నిజమేనా నిజమేనా నువ్వన్నది నిజమేనా… కను తెరిచి నీ ముందే కలనే కన్నానా….. ప్రతి క్షణం నీ వెంటే ఇన్నాళ్లుగా తిరిగానే, నేనేమిటో కొంచెం కూడా అర్థం కాలేదా…’ అంటూ హార్ట్‌ టచింగ్‌ గా సాగుతుందీ పాట.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi