రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘కాంతార’ బ్లాక్‌బస్టర్ కావడంతో, ఈ చిత్రానికి ప్రీక్వెల్ తీసాడు రిషబ్‌శెట్టి. రూ. 20 కోట్ల బడ్జెట్‌లోపే రూపొందిన ‘కాంతార’ సినిమా ప్రపంచ వ్యాప్తం గా రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసి, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాగా, ఈ సినిమా ప్రీక్వెల్ ‘కాంతార’ చాప్టర్1 ఈ దసరా సందర్భంగా అక్టోబరు 2న విడుదల కానుంది. గతంలో కాంతార సినిమాను ముందుగా కన్నడ భాషలో విడుదల చేసి, ఆ తర్వాత తెలుగులో విడుదల చేశారు. కానీ ‘కాంతర’ ప్రీక్వెల్‌ను మాత్రం కన్నడ భాషతో పాటుగా, ఇతరభాషల్లోనూ ఏకకాలంలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. తెలుగు హక్కులు దాదాపు రూ. 100 కోట్లు చెబుతున్నారనే టాక్ వినిపిస్తోం ది.
ఇంతవరకు బాగానే ఉంది…కానీ ‘కాంతార’ ప్రీక్వెల్‌ను స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ ఇంగ్లీష్, స్పానిష్ వెర్షన్‌లకు అక్కడ ఎలాంటి స్పందన వస్తుందనే అంశంపై టాలీవుడ్ నిర్మాతలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే… మహేశ్‌బాబు – రాజమౌళి కాంబినేషన్‌లోని ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ29’, ప్రభాస్ ‘స్పిరిట్’ ,ఎన్టీఆర్ ‘డ్రాగన్’, రామ్ చరణ్ ‘పెద్ది’, నాని ‘ది ప్యారడైజ్’….వంటి సినిమానాలను ఇంగ్లీష్, స్పానిష్‌భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు మొదలైయ్యాయి. మరి..అక్కడ ఇండియన్ సినిమాకు ఎలాంటి మార్కెంట్ ఉంటుంది. ప్రేక్షకాదరణ ఎలా ఉండబోతుంది? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఇలా….‘కాంతార’ ఇంటర్‌నేషనల్ వెర్షన్ రిలీజ్ రెస్పాన్స్‌పై టాలీవుడ్ నిర్మాతలు కాస్త ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు.
ఇక కాంతార ప్రీక్వెల్ ‘కాంతార: చాఫ్టర్ 1’ సినిమా రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందు తుండగా, రుక్మీణీ వసంత్, గుల్షన్ దేవయ్య, జయరాంలు…ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 7–8 శతాబ్దాల టైమ్‌లైన్‌లో ‘కాంతార: చాఫ్టర్1’ సినిమా ఉంటుందట. రిషబ్‌శెట్టి క్యారెక్టరై జేషన్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని సమాచారం.హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించాడు.