Upendra’s UI the Movie: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కెరీర్‌లో ఎన్నో వినూత్న, విలక్షణమైన సినిమాలు ఉన్నాయి. ‘ఏ, ఉపేంద్ర, ష్, హెచ్2 ఓ’..ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ కొంతకాలంగా ఉపేంద్ర నుంచి ఓ కొత్త తరహా సినిమా అయితే రాలేదనే చెప్పుకోవాలి. కానీ ఉపేంద్ర ఇప్పుడు చేస్తున్న ‘యూఐ’ సినిమా మాత్రం చాలాకొత్తగా ఉందనిపిస్తోంది. ‘ది వార్నర్’ పేరిట విడుదలైన ‘యూఐ’ టీజర్ చర్చనీయాంశమైంది.
కోవిడ్, నిరుద్యోగం, ద్రవ్యోల్భణం, ప్రపంచయుద్ధాలు, గ్లోబల్ వార్మింగ్, ఏఐ ప్రభావం…ఇవన్నీ మానవాళి ఉనికిని, జీవనాన్ని ప్రభావితం చేస్తే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో ఉపేంద్ర సినిమా తీస్తున్నట్లుగా ఉన్నా డు. పైగా కథ 2040లో జరుగుతుంది కాబట్టి…అప్పటి పరిస్థితులు ఎలా ఉంటా యో, మానవ జీవితం ఏమౌతుందో అన్న ప్రశ్నలను లేవదిస్తూ ఉపేంద్ర యూఐ సినిమా తీస్తున్నాడు. వెపన్స్, మంగళయానం..అంటూ వేలకోట్లు ఖర్చు చేస్తున్న ప్రజాప్రతినిధులు సామాన్య జనాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణను కూడా ఉపేంద్ర ఈ సినిమాతో చెప్పాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ‘యూఐ’ సినిమా ఎన్ని సంచనాలకు దారి తీస్తుందో చూడాలి.
ఉపేంద్ర నటించి, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 20, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో రీష్మా నానయ్య, మురళీ శర్మ, సన్నీలియోన్, నిధి సుబ్బయ్య, సాధు కోకిల, మురళీ కృష్ణ, ఇంద్రజిత్ లంకేష్…ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు.