VaayuvTeja Konidela: వరుణ్‌తేజ్– లావాణ్యా త్రిపాఠి దంపతుల కుమారుడికి వాయువ్ తేజ్ కొణిదెల (VaayuvTeja Konidela) అనే పేరు ఖరారైంది. గత నెల సెప్టెంబరు 10న లావాణ్య త్రిపాఠి ఓ బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కాగా వాయువ్ తేజ్ బారసాల కార్యక్రమం ఇటీవల జరిగినట్లుగా తెలుస్తోంది. దసరా సందర్భంగా తమ కుమారుడికి వాయువ్‌తేజ్‌గా నామాకరణం చేసినట్లుగా, అధికా రికంగా ప్రకటించి, ఇన్‌స్టాలో ఫోటోలను షేర్ చేశారు లావణ్య, వరుణ్ (Varunteja).
View this post on Instagram
2017లో వరుణ్‌తేజ్–లావాణ్య త్రిపాఠిలు తొలిసారిగా ‘మిస్టర్’ సినిమా కోసం కలిశారు. ఆ తర్వాత వీరిద్దరు ‘అంతరిక్షం’ సినిమా చేశారు. ఈ సినిమాల ప్రయాణంలోనే, వీరి ప్రేమ బల పడింది. అలా 2023 నవంబరు 1న లావాణ్య–వరుణ్‌తేజ్‌ల వివాహం ఇటలీలో జరిగింది.