Venkatesh 77th film:: హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా రానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యమైంది.
కాగా, లేటెస్ట్‌గా ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన ఫోటోషూట్ ఈ బుధవారం హైద రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగిందని తెలిసింది. ఈ నెలాఖర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధిశెట్టి యాక్ట్ చేయనున్నారని తెలిసింది. ఈ ఫోటో షూట్‌లో శ్రీనిధిశెట్టి కూడా పాల్గొన్నారు.
త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాకపోతే త్రివిక్రమ్ సినిమాల్లో సాధారణంగా ఇద్దరు హీరోయిన్స్ ఉంటుంటారు. ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. మ రి..శ్రీనిధిశెట్టి మెయిన్ హీరోయిన్‌గా కనిపిస్తారా? లేక సెకండ్ హీరోయిన్‌గా చేస్తారా? అనే విషయంపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది.
వెంకటేశ్ కెరీర్‌లోని ఈ 77వ సినిమాకు ‘ఆనంద నిలయం’, ‘వెంకటరమరణ’, ‘వెంకటరమణ కేరాఫ్ ఆనంద నిలయం’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీ లిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా కథ నం కూడా వైజాగ్ నేపథ్యంతో సాగుతుందట. గతంలో త్రివిక్రమ్ రైటర్‌గా పనిచేసి, వెంకటేశ్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రాలు ‘నవ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి’ చిత్రాలకు కూడా వైజా గ్ నేపథ్యం ఉన్న సంగతి తెలిసిందే.