Venkatesh joinsi Mana Shankara Vara Prasad Garu: చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లోని ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాలో వెంక టేశ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్రం యూనిట్ గురువారం ఓ వీడి యోను రిలీజ్ చేసి, అధికారికంగా ప్రకటించింది. ఇందులో..మై బ్రదర్…వెంకీ..మై బాస్’ అం టూ చిరంజీవి పలికిన సంభాషణలు ఉన్నాయి.
View this post on Instagram
ప్రస్తుతం మనశంకరవరప్రసాద్‌గారు సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడి యోలో జరుగుతుంది. ఆల్రెడీ వెంకటేశ్ ఈ సినిమా సెట్స్‌లో పాల్గొంటున్నారు. చిరంజీవి, వెం కటేశ్‌లతో పాటుగా, ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటుండగా, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. వెంకటేశ్, చిరంజీవి కాంబినేషన్‌లో ఓ సాంగ్ కూడా ఉంటుందని తెలిసింది. ఈ సెలబ్రేషన్ సాంగ్‌లో చిరంజీవి, వెంకటేశ్‌లతో పాటుగా, ‘మన శంకరవర ప్రసాద్‌గారు’ సినిమా యూనిట్‌లోని అందరు పాల్గొంటారని తెలిసింది. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఇక మన శంకరవరప్రసాద్‌గారు సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వీటీవీ గణేష్, క్యాథరీన్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుస్మితా కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి సందర్భంగా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్‌పై ఓ స్పష్టత రావాల్సి ఉంది. జనవరి 13 లేదా జనవరి 12న ‘మనశంకరవరప్రసాద్‌గారు’ (Manashankaravaraprasadhgaru Releasedate?) సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మన శంకరవరప్రసాద్‌గారు సినిమాలో చిరంజీవి ఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. చిరంజీవి, నయనతారలు భార్య భర్తలుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘మీసాల పిల్ల’ పాటకు మంచి రెస్పాన్స్ లభించిన సంగతి తెలిసిందే.