vennela kishore Interview: నా బెస్ట్‌ త్రీ మూవీస్‌ అవే

Viswa
4 Min Read
telugu comedian Vennelakishore Interview

Web Stories

తెలుగు చిత్ర పరిశ్రమలో వెన్నెల కిశోర్‌ (vennela kishore Interview)  అగ్రశ్రేణి హాస్యనటులు. కానీ ఇండస్ట్రీలోని ప్రమోషన్స్‌ ఈవెంట్స్‌, ఇంటర్వ్యూలు..గట్రా వాటికి వెన్నెల కిశోర్‌ కాస్త దూరంగా ఉంటూ వస్తుంటారు. కానీ ఇటీవల ఆయన ట్రెండ్‌ మార్చి, ప్రమోషన్స్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సోలో ఇంటర్వ్యూలు సైతం ఇస్తున్నారు. ఇటీవల ఆయన ఓ లీడ్‌ యాక్టర్‌గా నటించిన ‘సింగిల్‌’ మూవీకి మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. శ్రీవిష్ణు హీరోగా చేసిన ఈ మూవీ మే 9, 2025న విడుదలైంది. సింగిల్‌ మూవీకి, ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌ చేసిన అరవింద్‌ పాత్రకు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ రావడం పట్ల ఆయన మాట్లాడారు. అలాగే పలు ఆసక్తికర విశేషాలను వెల్లడించారు.

vennela kishore Interview: ‘సింగిల్‌’ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తున్నందుకు సంతోషంగా ఉంది. శ్రీవిష్ణుగారి కామెడీ టైమింగ్, రియాక్షన్స్‌కు తగ్గట్లుగా…సరైన రియాక్షన్స్‌ ఇచ్చే…వ్యక్తి కావాలని దర్శకుడు కార్తీక రాజు…నన్ను తీసుకున్నారు. ఈ చిత్రానికి డైలాగ్స్‌రాసిన నందు–భానులు ఈ సినిమాలోని అరవింద్‌ క్యారెక్టర్‌ను నాకు చెప్పినప్పుడు చాలా ఎంజాయ్‌ చేశాను.

అందుకే..ప్రమోషన్స్‌కు దూరం

‘బ్రహ్మాఆనందం’ సినిమా నుంచి నేను ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న మాట వాస్తవమే. ఇప్పుడు అంతా మారిపోయింది. నటిస్తే..చాలు మన పని అయిపోయిందని అనుకుంటే సరిపోవడం లేదు. ప్రమోషన్స్‌లో కూడా పాల్గొనాలి. అయితే మేం నటించే సినిమాలు నెలకు ఓ ఐదారు రిలీజ్‌ అవుతూనే ఉంటాయి. అన్ని సినిమాల ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్, ప్రమోషన్స్‌లో పాల్గొనాలంటే కష్టమే. ఎందుకంటే…ఇతర సినిమాల షూటింగ్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది (vennela kishore Interview).

ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిశోర్‌ తాజా ఇంటర్వ్యూ
ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిశోర్‌ తాజా ఇంటర్వ్యూ

బ్రహ్మాఆనందం సినిమా ప్రొడ్యూసర్‌ రాహుల్‌ యాదవ్‌ నక్కా. నా షెడ్యూల్‌ను చక్కగా ప్లాన్‌ చేశారు. ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు వరకు నా సినిమాల షూటింగ్స్‌ ఉంటాయి.సాయంత్రం వేళ నేను రావడానికి నాకు ఇబ్బంది ఏమీ లేదు. అలానే ప్లాన్‌ చేశారు ఆయన. అలా బ్రహ్మా ఆనందం సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నాను. ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌’ సినిమాలో నేను హీరోనని నాకు తెలియదు. కమెడియన్స్‌ స్టోరీ అడిగితే దర్శకులు కొందరు చిరాకుపడుతుంటారు. అందుకే నేను ఆ సినిమాకు నా ట్రాక్‌ ఏంటో తెలుసుకున్నాను. అంత వరకు నటించాను. ఈ సినిమాలో అనన్యానాగళ్ల మెయిన్‌ లీడ్‌ రోల్‌ చేశారు. ఆ తర్వాత నా పాత్ర మెయిన్‌ లీడ్‌ అయిపోయింది. చెప్పాలంటే..ఆ సినిమాలో నేను హీరోనిని నాకే తెలి యదు. సినిమా చెప్పినప్పుడే…దర్శక–నిర్మాతలు నేనే హీరో అని చెప్పి ఉంటే..కచ్చితంగా ఈ సినిమా ప్రమోషన్స్‌లోనూ పాల్గొనేవాడిని.

vennela kishore Interview: నా వల్ల కథ ముందుకెళ్లాలి!

హాస్యనటులకు క్యారెక్టర్స్‌ ఎంచుకోవడం అంటూ ఏమీ ఉండదు. వచ్చినవి చేసుకుంటూ వెళ్తుండాలి. ఎన్‌ఆర్‌ఐ పెళ్లికొడుకు, హీరో ఫ్రెండ్, కథలో హాస్యనటుడు…ఇలాంటి రోటీన్‌ రోల్సే ఉంటాయి. అయితే..నా పాత్రతో కథ ముందుకు వెళితే….ఆ సినిమా చేసిన సంతృప్తి నాకు కలుగుతుంది. ఫలానా సీన్‌లో వెన్నెల కిశోర్‌ లేకపోయినా ఫర్లేదు. సినిమా ముందుకు వెళ్తుంది అన్నప్పుడు…ఆ సినిమా లేదా ఈ సీన్‌లో యాక్ట్‌ చేస్తే నేను నిరుత్సాహపడతాను.

ఇప్పుడంతా బోనస్‌

vennela kishore Interview2025: నా కెరీర్‌లో నేను చాలా సినిమాల్లో యాక్ట్‌ చేశాను. కానీ…‘వెన్నెల, బిందాజ్, దూకుడు’ సినిమాలు నాకు చాలా ఇష్టం. కొన్నిసార్లు..నా సీన్స్‌ స్క్రీన్‌పై నేను చూసుకోవడమే నాకు ఇష్టం ఉండదు. కానీ..అమితుమీ, ఒకే ఒక జీవితం, దూకుడు’ వంటి సినిమాలు…నాకు మంచి సంతృప్తినిచ్చాయి. హాస్యనటుడిగా నా డ్రీమ్‌ రోల్‌ అంటూ ఏమీ లేదు. మహేశ్‌బాబుగారి ‘దూకుడు’ సినిమాలో నేను చేసిన రోల్‌నే డ్రీమ్‌ రోల్‌గా ఫీలవుతుంటాను. ఇక ఇప్పుడు వస్తున్నదంతా…బోనస్‌ అనే అనుకుంటాను.

బ్రహ్మానందం వారసుడిని కాను!

బ్రహ్మాఆనందం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా…నేను ఆయన వారసుడిని అంటూ ఆయన మాట్లాడారు. కానీ ఆయన అభిమానమే. ఆ విషయాన్ని నేను యాక్సెప్ట్‌ చేయడం లేదు. లౌడర్‌ కామెడీ చేయడంలో వేణుమాధవ్‌గారు చాలా గొప్ప. ఎదుకంటే..లౌడర్‌ కామెడీ చేసేప్పుడు అది ఏ మాత్రం వర్కౌట్‌ కాకపోయినా..ఆడియన్స్‌కు చిరాకు వస్తుంది. అందుకే ఈ సీన్స్‌ చేసేప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుంటాను.

రైటర్స్‌కు గౌరవం దక్కడం లేదు!

vennela kishore: ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, టీవీ షోలు..వంటి వినోద మాధ్యమాల విసృతి పెరిగిపోయిన తర్వాత కామెడీ చేయడం అనేది సవాల్‌గా మారిపోయింది. ఇన్‌స్టా, టీవీ షోలు..వంటి వినోద మాధ్యమాలు..ఆడియన్స్‌కు ఉచితంగా వస్తాయి. కానీ వాళ్లు థియేటర్స్‌కు డబ్బులు పెట్టి, వచ్చి కూర్చొన్నప్పుడు…మంచి వినోదాన్ని అందించాలి. లేకపోతే వాళ్లు నిరుత్సాహపడతారు. నిజానికి రైటర్స్‌ తగ్గిపోయారు. నా దృష్టిలో దర్శకులకు దక్కుతున్న పారితోషికంగా రైటర్స్‌కూ కూడా దక్కాలి. కానీ ఇండస్ట్రీలో రైటర్స్‌కు సరైన ఆదరణ, హోదా, గౌరవం లభించడం లేదు.
దీంతో రైటర్స్‌ చాలా మంది డైరెక్టర్స్‌ అయిపోతున్నారు. లేదా యాక్టర్స్‌ అవుతున్నారు.

భవిష్యత్‌లో మళ్లీ డైరెక్షన్‌

బ్రహ్మానందం గారు చేసిన ‘జఫ్పా’ సినిమాకు నేను దర్శకత్వం వహించాను. ఆ తర్వాత డైరెక్షన్‌ చేయలేదు. డైరెక్టర్‌గా నేను విఫలమైయ్యానని ఒప్పుకుంటాను. ఇప్పట్లో అయితే కాదు…కానీ.. భవిష్యత్‌లో మళ్లీ దర్శకత్వం చేస్తాను. థ్రిల్లర్‌ జానర్‌ ఫిల్మ్స్‌ చేస్తాను.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos