Bhadrakaali Review: నటీనటులు: విజయ్ ఆంటోని, వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బోట్, రియా జిత్తు, మాస్టర్ కేశవ్
దర్శకత్వం – అరుణ్ ప్రభు
నిర్మాత – రామాంజనేయులు జవ్వాజి (సర్వంత్ రామ్ క్రియేషన్స్)
సమర్పణ- విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్- మీరా విజయ్ ఆంటోని
తెలుగు రిలీజ్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ – స్పిరిట్ మీడియా
కెమెరా – షెల్లీ కాలిస్ట్
సంగీతం – విజయ్ ఆంటోని
ఎడిటర్ – రేమండ్ డెరిక్
నిడివి 2 గంటల 37 నిమిషాలు
రిలీజ్‌డేట్: సెప్టెంబరు 19
రేటింగ్: 2.5
కథ
స్టేట్ సెక్రటేరియట్‌లో కిట్టు పవర్‌బ్రోకర్. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, పోలీస్ డిపార్ట్‌మెంట్…ఇలా స్టేట్‌లోని ఏ ప్రభుత్వ వ్యవస్థ లేదా మంత్రిత్వశాఖల్లోని పనులను కూడా తనకు ఇష్టం వచ్చినట్లు చేసుకోగల సత్తా ఉన్న పవర్ బ్రోకర్ కిట్టు (Bhadrakaali Review).
మరోవైపు ఓ మహిళ కేంద్ర మంత్రి ఓ ప్రాజెక్ట్‌తో కోట్లు కొల్లగొట్టాలని ప్లాన్ చేస్తుంది. తన సొంతభూమిని జపాన్ కంపెనీ వాళ్లకు కట్టబెట్టి, కోట్లు సంపాదించాలన్నది ప్లాన్. ఈ ప్రాజెక్ట్ కోసం పవర్‌ఫుల్ పవర్‌బ్రోకర్‌గా అభ్యంకర సామీ (సునీల్ కృపాలానీ) వర్క్ చేస్తుంటాడు. అయితే కేంద్రమంత్రి జపాన్ ప్రాజెక్ట్ కు అడ్డంకులు ఏర్పడతాయి. ఈ ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో పడటానికి ప్రధాన కారణం కిట్టు అని అభ్యంకర సామీ తెలుసుకుంటాడు. తనకింద పనిచేసే కిట్టు ఇంత పవర్‌ఫుల్‌గా ఎలా ఎది గాడని తెలుసుకునే ప్రయత్నంలో అభ్యంకర సామికి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. రూ. 6 వేల కోట్ల రూపాయలకు పైగా బ్రోకర్ కమిషన్ డబ్బులను కిట్టు సంపాదించాడని తెలుసు కుంటాడు. తన పలుకుబడితో కిట్టుని అరెస్ట్ చేయిస్తాడు. అలాగే రాష్ట్రపతి కావాలన్న తన కలను నిజం చేసుకోవాలని అభ్యంకర సామి ప్రయత్నాలు చేస్తుంటాడు. మరి..కిట్టు జైలు నుంచి ఎలా బయటకు వచ్చాడు? రాష్ట్రపతి కావాలనుకున్న అభ్యంకరసామిని ఎలా అడ్డుకున్నాడు? కిట్టు–అభ్యంకరసామిల మధ్య ఉన్న పాత పగ ఏమిటి? అసలు..పల్లిపాడులో ఏం జరిగింది? అన్నది మిగిలిన కథ (Bhadrakaali Review in telugu).
విశ్లేషణ
‘భద్రకాళి (Bhadrakaali )’ సినిమాకు అరుణ్ ప్రభు పురుషోత్తమున్ దర్శకుడు. ఈ డైరెక్టర్ తెరకెక్కించిన గత రెండు చిత్రాలు (వాళై, అరువి) సందేశాత్మక చిత్రాలే. ‘భద్రకాళి’ కూడా ఈ కోవలోకే వస్తుంది. కాకపోతే…ఈ భద్రకాళి సినిమాకు కాస్త రివెంజ్ ట్రాక్‌ను తన రైటింగ్‌లో రాశారు అరుణ్ ప్రభు.
పవర్ బ్రోకర్‌గా కిట్టు ఏంటో చూపించే సన్నివేశాలు, వేదతో కిట్టు మూగ ప్రేమ, కిట్టు అసలు రూపం బయటపడి, కిట్టు అరెస్ట్ కావడంతో తొలిభాగం ముగుస్తుంది. కిట్టు తిరిగి పుంజుకుని, అభ్యంకర్‌ను ఎలా అడ్డుకున్నాడు? అనే దాంతో సెకండాఫ్ కంప్లీట్ అవుతుంది.
పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం అని మేకర్స్ చెప్పారు. కానీ ఇందులో థ్రిల్‌ని పంచే సీన్స్ అయితే లేవు. ఫస్టాప్ ఫర్వాలేదనిపించినా, సెకండాఫ్ చాలా స్లోగా, సందేశాత్మక స్పీచ్‌లతో రోటీన్‌గా సాగు తుంది. ‘రోడ్డు మీద ఉన్నవాడికి తెలుస్తుంది అభివృద్ధి అంటే ఏమిటో’, ‘ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగే లోపు, ఇక్కడ మన రాష్ట్రపతి ఎలక్షన్ అంతా అయిపోతుంది’, ‘ఎదిరించేవాడు లేనంత కాలం బెదిరించేవాడిదే రాజ్యం’…ఇలాంటి డైలాగ్స్ బాగున్నాయి. ఆడియన్స్‌ను ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఈ తరహా సినిమాలను చూసే మూడ్‌లో ఆడియన్స్ లేరీప్పుడు. కానీ దర్శకుడు చెప్పిన విషయాలు మంచివే. ప్రస్తావించిన అంశాలు ఆలోచించదగ్గవే. కానీ సినిమాగా అంటే కష్టం. పైగా కిట్టు క్యారెక్టరైజేషన్‌లో రాబిన్‌హుడ్ టచ్ ఉండటం రోటీన్‌గా ఉం టుంది. రివెంజ్ ట్రాక్ 1980 కాలంనాటిది. మధ్యలో రజనీకాంత్ శివాజీ సినిమా గుర్తొస్తుంది. సినిమాలో కూడా కనిపిస్తుంది. క్లైమాక్స్‌లో కూడా కొత్తదనం లేదు. సెకండాఫ్ అంతా ఊహాత్మక సన్నివేశాలతోనే సాగుతుంది.
నటీనటులు – సాంకేతిక విభాగం
కిట్టు పాత్రలో విజయ్ ఆంటోనీ నటించాడు. ఈ పాత్రకు న్యాయం చేశాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ విజయ్ ఆంటోనీ మంచి యాక్టింగ్ చూపించాడు. విజయ్ భార్య వేదాగా తృప్తి స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌కే సరిపోయింది. యాక్టింగ్‌కు పెద్ద స్కోప్ లేని క్యారెక్టర్ ఇది. పవర్‌ఫుల్ పవర్ బ్రోకర్ అభ్యంకర సామిగా సునీల్ కృపాలానీకి మంచి రోల్ పడింది. అలాగే టాస్క్‌ఫోర్స్ ఆఫీ సర్‌గా కిరణ్‌కు కథలో కీలకమైన పాత్ర లభించింది. కానీ యాక్టింగ్‌కు ఆస్కారం లేని పాత్ర ఇది.హీరో ఫ్రెండ్ మారుతిగా సెల్ మురుగన్‌ది కీలకమైన రోల్ చేశాడు. తృప్తి రవీంద్ర, రియా జిత్తు వంటి వారు తమ తమ పాత్రల పరిధిలో యాక్ట్ చేశారు. ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ సంగీతం ఒకే. కెమెరా వర్క్, నిర్మాణ విలువలు బాగున్నాయి. సెకండాఫ్‌లో కాస్త ఎడిటింగ్ చేయవచ్చు.