Vijay Sethupathi in Arasan: హీరో శింబు (STR), దర్శకుడు వెట్రిమారన్ (Director Vetrimaran) కాంబినేషన్‌లో ‘అరసన్’ (Arasan) అనే సినిమా రూపుదిద్దుకుం టుంది. వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి.ఎస్. థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ చెన్నై లోకేషన్స్‌లో జరుగుతుందని తెలిసింది. అయితే ఈ చిత్రంలో శింబుతో పాటుగా, విజయ్‌సేతుపతి కూడా మరో లీడ్ రోల్ చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ ‘అరసన్’ సినిమా తెలుగులో ‘సామ్రాజ్యం’ పేరుతో విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై ఇంకా ఓ స్పష్టత రాలేదు. ముఖ్యంగా సమంత పేరు వినిపిస్తుంది. శ్రీలీల, మృణాల్‌ఠాకూర్, వంటి హీరోయిన్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.అలాగే అరసన్ సినిమాలో విజయ్‌సేతుపతి చేయనున్న పాత్రపై కూడా కోలీవుడ్‌లో విభిన్నరకాలైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి విలన్‌గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది.
ఇక వెట్రిమారన్ డైరెక్షన్‌లో వచ్చిన గత చిత్రం ‘విడుదల, విడుదల 2’ చిత్రాల్లో విజయ్ సేతు పతి లీడ్ రోల్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాల తర్వాత వెట్రిమారన్ డైరెక్షన్‌లోని లేటెస్ట్ మూవీ ‘అరసన్’లోనూ విజయ్‌సేతుపతి ఓ లీడ్ రోల్ చేస్తుండం విశేషం.
ఇక నార్త్ చెన్నై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమా ‘అరసన్’. గతంలో ధనుష్ హీరోగా వెట్రిమారన్ డైరెక్షన్‌లో వచ్చిన ‘వడచెన్నై’ నేపథ్యంతోనే ఈ సినిమా కూడా ఉంటుంది. ఒక రకంగా…‘వడచెన్నై’ సినిమాటిక్ వరల్డ్‌లోనే ‘అరసన్’ చిత్రం కూడా తెరకెక్కుతున్నట్లుగా తెలు స్తుంది. ప్రస్తుతానికైతే, ఈ ‘అరసన్’ సినిమాను వచ్చే ఏడాది తెలుగు, తమిళం, హిందీ, కన్న డం, మలయాళం భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.