VijayDevarakonda and Rashmika Wedding Photos: హీరో విజయ్‌దేవరకొండ, రష్మికమందన్నాల వివాహం (ViRoshWedding) గురువారం అనగా..2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలేస్‌లో ఘనంగా జరిగింది (Hero VijayDevaraKonda and RashmikaMandanna Marriage Photo 2026).
ఫిబ్రవరి 26 ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మికమందన్నా మెడలో విజయ్‌దేవరకొండ మూడుముళ్ళు వేశారు.వీరి వివాహం రెండు పద్దతుల్లో జరిగింది. ఉదయం హిందూ సాంప్రదాయం ప్రకారం, సాయంత్రం కొడువ విధానంలో వీరి పెళ్లి జరిగింది.బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలోనే వీరి పెళ్లి జరిగింది. మార్చి 4న హైదరాబాద్‌లో తెలుగు చలన చిత్రపరిశ్రమ ప్రముఖలు హజరు అయ్యేట్లుగా గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.వివాహం పూర్తయిన తర్వాత తమ పెళ్లి ఫోటోలను విజయ్‌దేవరకొండ, రష్మికా మందన్నాలు సోషల్‌మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్ అయ్యాయి.
విజయ్‌దేవరకొండ నా భర్త. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి. నన్ను నమ్మకండి..ఈ వ్యక్తి గురించి నేనొక పుస్తకం రాయగలను. మేం అత్యుత్తమ జీవితాన్ని ప్రారంభించనున్నాం అంటూ…ఇన్‌స్టా వేదికగా రష్మిక మందన్నా ఓ లాంగ్ పోస్ట్‌ను షేర్ చేశారు.
నేను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలంటే తను (రష్మిక మందన్నా) నా పక్కన ఉండాలి. అందుకే నా ప్రాణస్నేహితురాలినే భార్యగా చేసుకున్నాను.. అంటూ విజయ్‌దేవరకొండ కూడా సోషల్‌మీడియాలో ఓ లాంగ్ పోస్ట్‌ను షేర్ చేశారు.
విజయ్‌దేవరకొండ, రష్మికా మందన్నాలు తొలిసారి ‘గీతగోవిందం’ (2018) సినిమాలో కలిసి యాక్ట్ చేశారు. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ (2019) సినిమాల్లో కలిసి నటించారు.
ఈ సినిమాల ప్రయాణంలోనే వీరిమధ్య ప్రేమ మొదలై, ఈ ప్రేమ వివాహబంధంగా మారింది. ప్రెజెంట్ ‘రణబాలి’ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు రష్మికా మందన్నా, విజయ్‌దేవరకొండ.