విజయ్‌దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమా మరో ఐదు రోజుల్లో థియేటర్స్‌లో విడుదల కానుంది. లేటెస్ట్‌గా ‘కింగ్డమ్’ సినిమా ట్రైలర్ (Kingdom Trailer) ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా, మంచి కథతో విజయ్‌దేవరకొండ (vijayDevarakonda) ఇంటెన్స్ యాక్షన్, సత్యదేవ్ విజువల్స్‌తో మంచిగా కనిపించింది. ట్రైలర్ ద్వారా చెప్పిన స్టోరీ కూడా సూపర్‌గా ఉంది. ఈ కథకు మంచి స్క్రీన్ ప్లే తోడైతే, ఈ ‘కింగ్డమ్’ సినిమాతో విజయ్‌దేవరకొండ హిట్ కొట్టినట్లే. గౌతమ్ తిన్ననూరి (Gowtham thinnanuri) డైరెక్షన్‌లో నాగవంశీ (Nagavamsi), సాయి సౌజన్యలు ఈ సినిమా కింగ్డమ్ సినిమాను రూ. 130 కోట్ల రూపాయాల బడ్జెట్‌తో నిర్మించారు. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ ‘కింగ్డమ్’ సినిమా హిందీలోనూ విడుదల కానుంది. కాకపోతే హిందీలో ‘సామ్రాజ్య’ అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. హిందీలో కూడా జూలై 31 (kingdomMovie Release date)నే రిలీజ్ చేద్దామనుకుంటున్నారు. కాకపోతే..హిందీలో ప్రజెంట్ ‘సయ్యరా’ సినిమా దూసుకుపోతుంది. ఆగస్టు 1న అజయ్‌దేవగన్ ‘సన్నాఫ్ ఆఫ్ సర్దార్ 2’, సిద్ధాంత్ చతుర్వేది, యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రీ నటించిన ‘ధడక్ 2’ సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హిందీ బెల్ట్‌లో థియేటర్స్ సమస్యలు రావొచ్చు. మరి..జూలై31నే, ‘కింగ్డమ్’ సినిమా థియేటర్స్‌లోకి వస్తుందా? లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమా తెలుగు ట్రైలర్‌లోని డైలాగ్స్ ఇలా ఉన్నాయి.
ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం నువ్వు అండర్‌కవర్ ఆపరేషన్ స్పైగా మారాలి
నీ ఇల్లు…ఉద్యోగం..ఊరు అన్ని..వదిలేయాలి…
నువ్వు అడుగుపెట్టబోయే ప్రపంచం…నువ్వు కలవబోయే మనుషులు..నువ్వు ఎదుర్కొబోయే పరిస్థితులు….చాలా రిస్కీ ఆపరేషన్స్ సూరి (విజయ్‌దేవరకొండ పాత్ర పేరు)…
శివ (సినిమాలో సత్యదేవ్ పాత్ర పేరు) నవ్వు స్పైగా వెళ్లబోయే గ్యాంగ్‌కి లీడర్…..

మీ అన్న ఇక్కడ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్..స్మగ్లర్…నీకు దేవుడు అవ్వొచ్చెమో..కానీ నిజానికి రాక్షసుడు మీ అన్న… (భాగ్య శ్రీ భోర్సే)
వాడి కోసం అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్…నేను… (విజయ్‌దేవరకొండ)
వాళ్ల చావో బతుకో..తేల్చేది ఈ ఐదు నిమిషాలే…. (విజయ్‌దేవరకొండ)
కొత్తగా వచ్చావ్…కదా..ఇడ కొన్ని రూల్స్ ఉన్నాయ్…
యుద్ధం ఇప్పుడే మొదలైంది.
ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది…మనుషులను కూడా రాక్షసులుగా మార్చేస్తుంది….
ఇప్పుడు వాడెమో…ఈ రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు…!

ట్రైలర్ చూస్తుంటే..ఇది శివ (సత్యదేవ్), సూరి (విజయ్‌దేవరకొండ) అనే ఇద్దరు అన్నదమ్ముల స్టోరీగా తెలుస్తుంది. శ్రీకాకుళంలో తప్పిపోయిన అన్నయ్య, శ్రీలంకలో ఏం చేస్తున్నాడు? అక్కడ గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాడు? అని సూరి తెలుసుకోవడం కథలో కీలకమైన అంశంగా ఉంటుందని అనిపిస్తోంది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, ఇంటెన్స్ యాక్షన్, అండ్ ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయనిపిస్తోంది.
సూరి తండ్రి పోలీసాఫీసర్ అని అన్నాఅంటేనే..సాంగ్ విజువల్‌తో తెలుస్తుంది. పోలీస్ కుటుంబం నేపథ్యంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరు గ్యాంగ్‌స్టర్‌గా, మరోకరు పోలీస్ స్పైగా ఎందుకు మారారు? అన్నదే ఈ చిత్రం మెయిన్ కాన్‌ఫ్లిక్ట్‌గా తెలుస్తోంది.
అలాగే ఈ సినిమా ట్రైలర్ చివర్లో ..ఓ మిస్టీరియస్ షాట్ ఉంది. ఇది విజయ్‌దేవరకొండయే అని తెలుస్తోంది. గతంలో ఈ సినిమాలో పునర్జన్మ నేపథ్యంలో ఉంటుందనే టాక్ వినిపించింది. ఈ షాట్‌ను అది నిజమే అనిపిస్తోంది. ఈ విజువల్స్ సెకండ్ పార్ట్‌కు లీడ్ కూడా కావొచ్చు. మరింత…క్లారిటీ రావలంటే…ఈ సినిమాను జూలై 31న థియేటర్స్‌లో చూడాల్సిందే.