విశ్వక్‌షేన్‌ ఫంకీ సినిమా హిట్టా? ఫట్టా?

Viswa

Web Stories

సినిమా : ఫంకీ (Funky Review)
తారాగణం: విశ్వక్ సేన్, కయాదు లోహర్‌, నరేష్, వీటీవీ గణేష్, సంపత్‌రాజ్‌
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
దర్శకత్వం: అనుదీప్ కె.వి.
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: సురేష్ సారంగం
రచన: అనుదీప్ కె.వి, మోహన్
విడుదల తేదీ: 13-02-2026 (Funky Movie Release date)
రేటింగ్‌ 2/5 (funky Movie Review and Rating)

Funky story review: కథ

మంచి ప్రొడక్షన్స్‌ నిర్మాణసంస్థలో కోమల్‌ (విష్యక్‌సేన్‌) ‘ఫంకీ’ అనే సినిమాను డైరెక్ట్‌ చేస్తుంటాడు. కోమల్‌కి దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. నాలుగు కోట్ల రూపాయాలతో సినిమా చేస్తానని చెప్పి, ఈ సినిమా బడ్జెట్‌ను 40 కోట్లు చేస్తాడు కోమల్‌. దీంతో నిర్మాత (వీకే నరేష్‌) అనారోగ్యానికి గురి అవు తాడు. నిర్మాత కుమార్తె చిత్ర (కయాదు లోహర్‌) మరో కోటి రూపాయల్లోనే కోమల్‌తోనే ‘ఫంకీ’ సినిమాను కంప్లీట్‌ చేస్తానని తండ్రితో చెబుతుంది. అలా కోమల్‌తో మాట్లాడుతుంది. ఈ సినిమా ప్రయాణంలో ఒకరికొకరు దగ్గర అవుతారు. మరి..ఆ తర్వాత ఏం జరిగింది? కోమల్‌ నిజంగానే మిగిలిన సినిమాను చిత్ర చెప్పినట్లుగా కోటి రూపాయల్లోనే సినిమాను కంప్లీట్‌ చేశాడా? అసలు కోమల్‌ బ్యాగ్రౌండ్‌ ఏమిటి? అన్నది సినిమాలో చూడాలి.

విశ్లేషణ

ఈ సినిమాకు దర్శకుడు అనుదీవ్‌ కేవీ. ఈ పేరు చదవగానే వెంటనే గుర్తొచ్చేది బ్లాక్‌బస్టర్‌ సినిమా ‘జాతి రత్నాలు’. దర్శకుడిగా అనుదీప్‌ ‘జాతిరత్నాలు’ తొలి సినిమా. ఈ సినిమా తర్వాత తమిళ యాక్టర్‌ శివకార్తీకేయన్‌తో అనుదీప్‌ ‘ప్రిన్స్‌’ అనే సినిమా తీసి, బోల్తా కొట్టాడు. ఇప్పుడు ‘ఫంకీ’ సినిమాతో మరో ఎదురు దెబ్బ తగిలింది. ‘ఫంకీ’ సినిమాలో కథ ఏమి లేదని, కేవలం నవ్వుకోవడానికే సినిమా తీశామని ఈ చిత్రం నిర్మాత నాగవంశీ ఆడియన్స్‌ను కొంత ప్రిపేర్‌ చేయడమే మంచిదైంది. నిజానికి ఈ సినిమాలో మెయిన్‌ కథ అంటూ ఏమీ లేదు. కొసమెరుప్పుల్లా మెరిసే కొన్ని వన్‌లైనర్స్‌ తప్ప. కథలో జోకులు, వన్‌ లైనర్లు ఉంటే ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేస్తారు. కానీ కథే జోకు, వన్‌లైనర్‌ అంటే మాత్రం ఇలాంటి సినిమాలు
చూడటం ఆడియన్స్‌కు గలిజనిపిస్తది. (Funky movie review)

Funky Movie Review in telugu
Funky Movie Review in telugu

కోమల్‌ని కరెక్ట్‌ చేసి, చిత్ర ఈసినిమాను కంప్లీట్‌ చేయాలనుకోవడం అనేది ఈ సినిమా మెయిన్‌ కథాంశంనా? లేక ఎమోషన్స్‌ను ఎక్స్‌ప్రెష్‌ చేయ లేని కోమల్‌ క్యారెక్టరైజేషన్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ మెయిన్‌ స్టోరీనా? అన్నది ఆడియన్స్‌కు అంతుపట్టదు. ఈ విషయంలో దర్శకుడు క్లారిటీ ఉండి, సినిమా తీసినట్లయితే, ఆడియన్స్‌ థియేటర్స్‌లో కాస్త అయిన ఊరట చెందేవారు. అంతకుల బొంతలా ఉన్న ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయడంలో పూర్తిగా విఫలమైందనే చెప్పవచ్చు. కాదు..కన్ఫార్మ్‌ చేసుకోవచ్చు. కాకపోతే..సెకండాఫ్‌లో మదర్‌సెంటిమెంట్‌ సీన్స్‌ బాగున్నాయి. కానీ ఒక్క సీక్వెన్స్‌నే సినిమాకు సరిపోదు కదా. నాగవంశీ, దిల్‌ రాజు, హరీష్‌శంకర్‌, కళ్యాణ్‌శంకర్‌, అనుదీప్‌ల క్యామియోలు ఫర్వాలేదనిపించాయి. కానీ రెగ్యులర్‌గా సినిమాలను ఫాలో అయ్యేవారికే ఇవి అర్థం అవుతాయి. సాధారణ ఆడియన్స్‌కు వీరి జోక్‌లు క్రాక్‌ అవ్వకపోవచ్చు (Funky film review).

నటీనటులు -సాంకేతిక విభాగం

కోమల్‌గా స్క్రీన్‌పై కనిపించేందుకు విష్యక్‌ యాక్టర్‌గా తనవంతు ప్రయత్నం చేశాడు. ఒక సీన్‌లో బొద్దుగా, మరో సీన్‌లో సన్నగా కనిపించాడు. చిత్రగా కయాదు లోహర్‌ తన రోల్‌ తాను చేసింది. స్క్రీన్‌పై అందంగా కనిపించింది. మంచి ప్రొడక్షన్స్‌ నిర్మాతగా వీకే నరేష్‌, జీకేగా సంపత్‌రాజ్‌లు నటించారు. మిగతా పాత్రలకు కథలో పెద్ద ప్రాముఖ్యత లేకుండ పోయింది. (Funky cast and crew) భీమ్స్‌ మ్యూజిక్ యావరేజ్‌. విజువల్స్‌, ఎడిటింగ్‌ ఒకే ఒకే. నిర్మాణ విలువలు రెగ్యులర్‌గా ఉన్నాయి. ‘జాతి రత్నాలు’ తర్వాత అనుదీప్‌ తీసిన ‘ప్రిన్స్‌’, కానీ ఇప్పుడు ‘ఫంకీ’ కానీ…. ఈ రెండు సినిమాలను ‘జాతి రత్నాలు’ ఫ్లేవర్‌లోనే తీయాలని అనుదీప్‌ అనుకోవడం పొరపాటే. మ్యాజిక్ క్రియేట్‌ అవ్వాలి. మనం క్రియేట్‌ చేస్తే అది మ్యాజిక్ కాదు. అది క్రియేటివిటి. ఇందులో మ్యాజిక్ లేదు. క్రియేటివిటీ అసలే లేదు.

అనుదీప్‌ కేవీ ఇంకా జాతిరత్నాలు కాంపౌడ్‌లోనే ఉంటూ కథలు రాస్తున్నట్లున్నారు. కథలో కామెడీ ఎక్కువైన అది వెగటుగానే అనిపిస్తుంది. కథ లేకుండ కామెడీ సీన్స్‌నే రాసుకుని, పేర్చుకుంటూ పోతే అది సినిమాగా ఆడియన్స్‌కు మెప్పించదు. పైగా విసుగు తెప్పిస్తుంది. విశ్వక్‌, అనుదీప్‌..ఇద్దరి కెరీర్‌కు ఈ ఫంకీ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని అనుకున్నారు. కానీ, ఫంకీ సినిమా వీరిద్దరి కెరీర్‌లో మరో పెద్ద బ్లాక్‌మార్క్‌గా పడిపోయింది. పైగా గత ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్బంగా ‘లైలా’తో డిజాస్టర్‌ అందుకున్న విష్యక్‌కు, మళ్లీ ఈ ఏడాది ఫంకీ రూపంలో మరో అపజయం ఎదురుకావడం అతని కెరీర్‌కు కాస్త ఇబ్బందనే చెప్పాలి.
Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos