కళ్యాణ్‌రామ్‌తో ‘బింబిసార’ వంటి బ్లాక్‌బాస్టర్ మూవీ తర్వాత ఈ చిత్రం దర్శకుడు వశిష్ఠ ప్రజెంట్ ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు ముందుగా రామ్‌చరణ్‌ను అనుకున్నాట వశిష్ఠ. ఈ సినిమా కథను రామ్‌చరణ్‌కు చెప్పగా, చిరంజీవికి కూడా చెప్పాలని చరణ్ అన్నారట. దీంతో వశిష్ట ఈ కథను చిరం జీవికి కూడా చెప్పారట. ఈ విశ్వంభర కథ చిరంజీవికి కూడా నచ్చడంతో వశిష్ఠకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
కానీ ఆ పాటికే చరణ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో ఫుల్ బీజీగా ఉన్నాడు. ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. తమిళ దర్శకుడు శంకర్‌తో రామ్‌చరణ్ హీరోగా ‘దిల్’ రాజు నిర్మించిన ‘గేమ్‌ఛేంజర్’ సినిమా జస్ట్ ఓపెనింగ్ పూర్తయింది. ఇంకా చిత్రీకరణ మొదలు కాలేదు. పైగా శంకర్ వంటి దర్శకుడితో సినిమా అంటే…కాస్త టైమ్ పడుతుంది. దీంతో అంత టైమ్ వెయిట్ చేయలేకపోయాడట వశిష్ఠ. దీంతో ‘విశ్వంభర’ కథ ఆల్రెడీ చిరంజీవికి నచ్చింది కాబట్టి…చిరంజీవియే హీరోగా ‘విశ్వంభర’ సినిమాను స్టార్ట్ చేశారట వశిష్ఠ. ఈ విషయాలను నిర్మాత సత్యనారాయణ వెల్లడించారు.
ఇక చిరంజీవి హీరోగా చేసిన ఈ ‘విశ్వంభర’ మూవీ జనవరి 10న విడుదల కావాల్సింది. వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ పెండింగ్ ఉండటం, కొంత రీషూట్ చేయాల్సి రావడం..వంటి కారణాల చేత రిలీజ్ వాయిదా పడింది. ఈ విశ్వంభర సినిమాను జూన్ 24న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి నిర్మించిన ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ‘విశ్వంభర’
కు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. త్రిషా , ఆషికా రంగనాథ్ హీరోయిన్స్. పసుపులేటి రమ్య, ఇషా చావ్లా కీలక పాత్రల్లో కనిపిస్తారు. కునాల్ కపూర్ విలన్‌గా కనిపిస్తాడు.