రామ్‌చరణ్ (ramcharan) ‘గేమ్‌ఛేంజర్’ మూవీ రిలీజైన తొలి రోజు దేశ వ్యాప్తంగా దాదాపు రూ. 90 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. మూవీ మేకర్స్ రూ. 186 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా పోస్టర్స్ రిలీజ్ చేశారు. మేకర్స్ చెప్పినవి ఫేక్ కలెక్షన్స్ అనీ, సోషల్‌మీడియా మొత్తం హోరెత్తిపోయింది.
ముఖ్యంగా చరణ్ అండ్ యాంటీ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో ‘గేమ్‌ఛేంజర్’ సినిమా రిజల్ట్‌ను ఓ ఆట ఆడు కున్నారు. ‘పుష్ప, కల్కి2898ఏడీ, దేవర’ కలెక్షన్స్, ఈ సినిమా హీరోలు అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ హీరోలతో పోలికలు పెట్టి, ఏవేవో పోస్టులు చేశారు. అసలు…చరణ్‌పై ఈ స్థాయిలో వ్యతిరేకత ఎందుకు? ఎందుకు వ్యక్తమైంది? అనే టాపిక్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
Daaku Maharaaj: దబిడి దిబిడి..డాకు మహారాజ్‌కు డ్యామేజ్!
ఫేక్ కలెక్షన్స్ తెలుగు ఇండస్ట్రీకి ఏమైనా కొత్తా? కానే కాదు. రిలీజైన ప్రతి సినిమాకు సక్సెస్‌మీట్ జరుగు తుంది. ప్రతి చిన్న సినిమాకూ జరుగుతుంది. అంటే…సక్సెస్‌మీట్ జరుపుకున్న సినిమాల్నీ సూపర్ సూపర్‌హిట్ అయ్యాయనా? కాదు కదా. మరి…చరణ్ విషయంలోనే ఫేక్ కలెక్షన్స్ ఎందుకు భూతద్దంలో చూస్తున్నారు.
‘పుష్ప: ది రైజ్’ మూవీ తెలుగులో హిటై్టందా? ‘పుష్ప ది రూల్’ మూవీ అన్నీ సెంటర్స్‌లో బ్రేక్ ఈవెన్ అయ్యిందా? అంటే ఏం చెబుతారు. కరోనా సమయంలో ఉన్న టికెట్ ధరలతో, ‘పుష్ప ది రైజ్’ మూవీ, తెలుగులో కొన్ని చోట్ల ఆడలేదని, వారిని ఆదుకున్నామని, ‘పుష్ప ది రూల్’ మూవీ రిలీజ్ డేట్ ఈవెంట్‌లో మైత్రీ నిర్మాతలు చెప్పింది నిజం కాదా?
‘పుష్పది రూల్, కల్కి2898ఏడీ, దేవర’ సినిమాల మాదిరి ‘గేమ్‌చేంజర్’ సినిమాకు సోలో రిలీజ్ డేట్ లేదు.
Ramcharan GameChanger Movie Review: రామ్‌చరణ్ గేమ్‌ఛేంజర్ మూవీ రివ్యూ
‘పుష్పది రూల్, కల్కి2898ఏడీ, దేవర’ సినిమాల దర్శకులు..శంకర్‌లా మరో రెండు సినిమాలు (ఇండియన్ 2, ఇండియన్ 3) తీయలేదు. ‘పుష్ప ది రూల్’లా సీక్వెల్ హైప్ లేదు.
2024లో వచ్చిన తొలి ¯పెద్ద మూవీ ‘కల్కి2898ఏడీ’. ‘కల్కి2898ఏడీ’ తర్వాత….రెండు నెలలు ఆడియన్స్ మరో పెద్ద హీరో సినిమా కోసం ఎదురు చూస్తుండగా, అప్పుడు ‘దేవర’ వచ్చింది. ‘దేవర’ వచ్చిన మరో రెండు నెలలకు మరో పెద్ద హీరో సినిమా ‘పుష్ప ది రూల్’ వచ్చింది. ఈ పరిస్థితి… .‘గేమ్‌చేంజర్’కు ఉందా?…ఓ పెద్ద సినిమా పుష్ప ది రూల్ థియేటర్స్‌లో ఉండగానే, ‘గేమ్‌చేంజర్’ మూవీ వచ్చింది.

పైగా శంకర్ సినిమాకు కథ ఇచ్చింది కార్తీక్‌సుబ్బరాజు. ఆయన కథ ఇచ్చింది ఎప్పుడో 2020లో. ఈ కథతో ‘గేమ్‌చేంజర్’ తీశారు.
‘పుష్ప ది రూల్’ మాదిరి, ఐదారు గంటలు తీసి, మూడు గంటల నిడిచి సెటప్ చేసుకోలేదు. రీ షూట్స్ అసలే చేయలేదు గేమ్‌చేంజర్ మూవీకి.
కథను ఏం చేయాలో తెలియక…‘దేవర, కల్కి2898ఏడీ, పుష్ప’లా రెండు పార్టులు అవ్వలేదు.
‘పుష్ప ది రూల్’ వల్ల జరిగిన రచ్చ కారణంగా, పెద్దస్థాయిలో ప్రమోసన్స్ చేయలేకపోయారు.
‘గేమ్‌చేంజర్’ దర్శకుడు శంకర్ గత చిత్రం ఇండియన్ 2…ఫ్లాప్ మూవీ. వెంటనే…ఆయన డైరెక్షన్‌లోని ‘గేమ్‌చేంజర్’ విడుదలై,ఈ మాత్రం కలెక్ట్ చేసిందంటే…అది కేవలం రామ్‌చరణ్ క్రేజే కారణం.
ఇలా ‘గేమ్‌చేంజర్’కు ఎన్నో ప్రతికూల పరిస్థితులు. అయినా..ఒక సినిమా సరిగ్గా ఆడనంత మాత్రానా చరణ్‌పై ఇంత వ్యతిరేకత ఎందుకు? మగధీర సినిమాతో తొలి రూ. 50 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్‌ను కొట్టింది రామ్‌చరణ్‌యే కదా. చిరంజీవిలాంటి ఓ పెద్ద మహావృక్షం నీడ నుంచి బయటకు వచ్చి, తనను తాను నిరూపించుకోలేదా?. ఆర్‌ఆర్‌ఆర్ మూవీతో నటుడిగా హాలీవుడ్ స్థాయి మెప్పు పొందలేదా?
కథ బాగలేక ..గేమ్‌చేంజర్ ఇబ్బంది పడుతోంది. ఇదే సినిమాలో రామ్‌చరణ్ అప్పన్నగా మెప్పించలేదా?
చాలామంది ఫేక్ కలెక్షన్స్‌తో తెలుగు సినిమా పరువు పోయిందని అంటున్నారు…కానీ ఇక్కడ నిజంగా పోతుంది.. తెలుగు సినిమా ఐక్యత అని గుర్తుపెట్టుకోవాలి.