ఆస్కార్స్‌లో సిన్నర్స్‌ ఆల్‌ టైమ్‌ రికార్డు

Viswa

Web Stories

98th Oscars Award Sinners Movie: ఆస్కార్‌ చరిత్రలోనే ‘సిన్నర్స్‌’  (Sinners Movie Oscars Awards) చిత్రం సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసింది. 98వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 15న అమెరికాలో జరగనుంది. భారతీయ కాలమానం ప్రకారం ఈ ప్రదానోత్సవం మార్చి 16న ఇండియాలో టెలికాస్ట్‌ అవుతుంది. తాజాగా ఆస్కార్‌ నామినేషన్స్‌ను ప్రకటించారు. అమెరికాకు చెందిన పీరియాడికల్‌ హారర్‌ సినిమా ‘సిన్నర్స్‌’ ఏకంగా 16 నామినేషన్స్‌ను దక్కించుకుంది. ఆస్కార్‌ చరిత్రలో ఓ సినిమాకు వచ్చిన అత్యధిక నామినేషన్స్‌ ఇవే కావడం విశేషం (98th Oscars Awards).

Ryan Coogler Sinners Movie Oscar Award

‘ఆల్‌ అబౌట్‌ ఈవ్, టైటానిక్, లా లా ల్యాండ్‌’ సినిమాలకు 14 ఆస్కార్‌ నామినేషన్స్‌ దక్కాయి. గతంలో ఆస్కార్స్‌లో అత్యధిక నామి నేషన్స్‌ దక్కించుకున్న రికార్డు ఈ సినిమాల పేరిట ఉండేది. తాజాగా, ‘సిన్నర్స్‌’ సినిమా ఈ రికార్డును అధిగమించి, 16 నామినేషన్స్‌ దక్కించుకుని, నామినేషన్స్‌లో ఆల్‌ టైమ్‌ రికార్డును సృష్టించింది (Academy Awards ceremony).

ఇక సిన్నర్స్‌ సినిమా విషయానికి వస్తే…రాయన్‌ కూగ్లర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, మైఖేల్‌ బి. జోర్డాన్, హైలీస్టెయిన్‌ఫీల్డ్, మైల్స్‌ కాటన్, జాక్‌ ఓ కానెల్, ఉన్మి మోసాకు, జేమీ లాసన్, ఒమర్‌ మిల్లర్, డేల్రాయ్‌ లిండ్‌లో ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. గత ఏడాది ఏప్రిల్‌ 18న ఈ సినిమా అమెరికాలో విడుదలైంది. దాదాపు 100 మిలియన్‌ డాలర్లతో రూపుదిద్దుకున్న ఈ సినిమా, 350 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసి, బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఫిల్మ్‌గా నిలిచింది. మరి..ఆస్కార్‌ నామినేషన్స్‌లో రికార్డులు సృష్టించిన ‘సిన్నర్స్‌’ సినిమా, ఆస్కార్‌ అవార్డులను సొంతం చేసుకోవడంలోనూ కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi