డ్రాగన్‌…అదిరిపోయే యాక్షన్‌

Viswa
1 Min Read
NTR Dragon Release date

Web Stories

Dragon: ఎన్టీఆర్‌ ‘డ్రాగన్‌’ సినిమా చిత్రీకరణకు సంబంధించిన కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌ మళ్లీ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. హైదరాబాద్‌ శివార్లలోని రామోజీ ఫిల్మ్‌ సిటీ స్టూడియోలో, ‘డ్రాగన్‌’ మూవీ  (Dragon)చిత్రీ కరణ ఈ వారంలో ప్రారంభం కానుంది. ఓ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించేం దుకు ఏర్పాట్లు చేశారు ఈ చిత్రం దర్శకుడు ప్రశాంత్‌నీల్‌. ఈ ఫైట్‌ ప్రిపరేషన్‌కు సబంధించిన ఫోటోనే ఇప్పుడు బయటకు వచ్చింది.

వచ్చే నెల 20న ఎన్టీఆర్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా, ‘డ్రాగన్‌’ సినిమా టీజర్, ఫస్ట్‌లుక్‌ లేదా టైటిల్‌ ఏదో ఒకటి బయటకు వచ్చే అవకాశం ఉంది. మోస్ట్‌లీ వీడియో కంటెంట్‌ ఏదీ బయటకు రాకపోవచ్చు. ఎందు కంటే… ఈ సినిమా రిలీజ్‌కు చాలా సమయం ఉంది. దీంతో ముందుగానే వీడియో కంటెంట్‌ను వదలి ఉపయోగం లేదని టీమ్‌ భావిస్తుందట. రీసెంట్‌గా అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్భంగా ‘రాకా’ సినిమా లుక్‌ మాత్రమే వచ్చింది. రిలీజ్‌ డేట్‌ ఎప్పుడో స్పష్టత లేని కారణంగా, వీడియో కంటెంట్‌ను రిలీజ్‌ చేయలేదు. ఫార్ములానే ‘డ్రాగన్‌’ అండ్‌ టీమ్‌ ప్లాన్‌ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

మరోవైపు ఈ ‘డ్రాగన్‌’ సినిమాలో, విలన్‌గా నటించాల్సిన మలయాళ యువ నటుడు టోవినోథామస్‌ తప్పుకున్నాడు. దీంతో ఈ ప్లేస్‌లో విలన్‌గా ఎవర్నీ కన్ఫార్మ్‌ చేయాలనే విషయంపై టీమ్‌ విసృతస్థాయిలో చర్చలు జరుపుతున్నట్లుగా తెలిసింది. షాహిద్‌కపూర్, వివేక్‌ఓబెరాయ్‌ వంటి వార్ల పేర్లు వినిపిస్తున్నాయి. రుక్మీణీవసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు (Dragon movie cast and crew). మైత్రీమూవీమేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై రవిశంకర్, నవీన్, కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కానున్నట్లుగా తెలిసింది.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi