97th Oscars Indian Movies eligible: ఆస్కార్‌ బరిలో మూడు భారతీయ చిత్రాలు కంగువ..ఆడుజీవితం..గర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్‌

Viswa
2 Min Read

Web Stories

97th Oscars Indian Movies eligible: సూర్య హీరోగా నటించిన ‘కంగువ’ సినిమా ఈ ఏడాది నవంబరు 14న థియేటర్స్‌లో విడుదలైంది. విడుదల అయిన రోజు నుంచే ‘కంగువ’ సినిమాకు నెగటివ్‌ రివ్యూస్‌ వచ్చాయి. బాక్సాఫీస్‌ వద్ద కూడా ‘కంగువ’ ఓ ఫ్లాప్‌ మూవీగా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద ఓ సక్సెస్‌ఫుల్‌ మూవీగా నిలవని, కంగువ చిత్రం.. ఇప్పుడు 97వ ఆస్కార్‌ అవార్డ్స్‌ బరిలో నిలిచి, అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

ఈ ఏడాది మార్చిలో 97వ ఆస్కార్‌ అవార్డ్స్‌ వేడుక జరగనుంది. మొత్తం 23 విభాగాల్లో అవార్డులను అంద జేస్తారు. తాజాగా ఈ 23 విభాగాల్లోని అవార్డులకు ప్రపంచవ్యాప్తంగా 323 సినిమాలను ఎంపిక చేసినట్లు, వీటిలో 207 సినిమాలు బెస్ట్‌ పిక్చర్‌ విభాగంలో పోటీ పడనున్నట్లుగా ఆస్కార్‌ కమిటీ ఓ నోట్‌ను రిలీజ్‌ చేసింది. ఈ లిస్ట్‌లో భారతీయ చిత్రాలు సూర్య ‘కంగువ (Kanguva) (తమిళం)’, పృథ్వీరాజ్‌సుకుమారన్‌ మలయాళం ‘ఆడుజీవితం (ది గోట్‌ లైఫ్‌)Aadujeevitham: The Goat Life)’, ఇండియా–ఫ్రెంచ్‌ దేశాలు కలిసి నిర్మించిన ‘గర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్‌’ (GirlsWillbeGirls) చిత్రాలు జనరల్‌ కేటగిరీ విభాగంలో ఆస్కార్‌ కన్సిసడరేషన్‌లో భాగంగా ఈ సినిమాలు ఎంపికైయ్యాయి. హిందీ చిత్రం ‘సంతోష్‌’ కూడా ఈ లిస్ట్‌లో ఉంది. కాకపోతే…సంతోష్‌ చిత్రం…యూకే దేశం తరఫున లిస్ట్‌లో చోటు సంపాదించింది (97th Oscars Indian Movies eligible)

ఇక మరోరెండు రోజుల తర్వాత ఆస్కార్‌ ఓటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఓటింగ్‌ పూర్తయిన తర్వాత ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌ జాబితాను ప్రకటిస్తారు. ఇక జనవరి 17న ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌ జాబితాను ప్రకటిస్తారు. 2025 మార్చి 2న, 97వ ఆస్కార్‌ అవార్డుల వేడుక లాస్‌ ఎంజిల్స్‌లో జరుగుతుంది.

ఇక ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆస్కార్‌కు ఇండియన్‌ అఫిషియల్‌ ఎంట్రీగా పంపబడిన హిందీ చిత్రం ‘లాపతా లేడీస్‌’ (Laapataa Ladies) ను పంపగా, ఈ చిత్రం ఈ విభాగంలో నిలవలేక పోయింది.

95వ ఆస్కార్‌ అవార్డ్స్‌కు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)ను ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వాళ్లు పంపలేదు. కానీ వారి సొంత ప్రయత్నాలు చేసి, ఫైనల్‌గా ‘నాటు నాటు’ పాటకు గాను, బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో అవార్డును దక్కించుకున్నారు. ఈ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి, చంద్రబోస్‌లకు ఆస్కార్‌ అవార్డులు దక్కాయి. మరి..ఈ చిత్రాల్లానే…కంగువ,ఆడుజీవితం చిత్రాలు కూడా ఏమైనా మ్యాజిక్‌ చేస్తాయా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

 

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos