తెలుగు ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు భారీ బడ్జెట్‌తో (దాదాపు రూ. 450 కోట్ల) తీసిన మూవీ ‘గేమ్‌చేంజర్’. రామ్‌చరణ్ హీరోగా చేసిన ఈ మూవీకి శంకర్ డైరెక్టర్. ‘గేమ్‌చేంజర్’ (Ramcharan Gamechanger Release) మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
‘గేమ్‌చేంజర్’ నిర్మాత ‘దిల్’ రాజు రిక్వెస్ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుకునే వెసులు బాటు కలిగించాయి. ఆంధ్రప్రదేశ్‌లో కాస్త ఎక్కువ రేట్లు పెంచుకునే వీలు ఉండగా, తెలంగాణలో మాత్రం ఓ మోస్తారు రేట్లు ఉన్నాయి.
అయితే ‘గేమ్‌చేంజర్’ చిత్రానికి టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం అనేది ఏ మేరకు లాభిస్తుంది? అన్నది ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో చర్చనీయాశంగా మారింది. ఎందుకంటే ‘గేమ్‌చేంజర్’ మూవీతో పాటుగా ఈ సంక్రాంతికి సీనియర్ హీరోలు బాలకృష్ణ చేసిన ‘డాకు మహారాజ్’, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు వస్తున్నాయి. అయితే గేమ్‌చేంజర్‌తో పోల్చిచూసినప్పుడు…డాకుమహారాజ్ (Daakumaharaj), సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాల టికెట్ రేట్లు తక్కువ. దీంతో సంక్రాంతి సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కు వెళ్తారు కాబట్టి….ఖరీదు విషయంలో ఓ అంచనా వేసుకుంటారు. ఆటోమేటిక్ గేమ్‌చేంజర్‌కు ఎక్కువ చార్జ్ అవుతుంది కాబట్టి….మెజారిటీ ఆడియన్స్ ‘డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలపైనే చూజ్ చేసుకోవచ్చు.
Ramcharan Gamechanger: బ్రేక్ ఈవెన్‌కి గేమ్‌చేంజర్ ఎంత కలెక్ట్ చేయాలి?
‘కల్కి2898ఏడీ, దేవర, పుష్ప2’ చిత్రాలు మొదటివారంలో ఎక్కువ టికెట్ ధరలతో ప్రదర్శించబడిన ఆడియన్స్ ఆదరించారు. ఎందుకంటే…ఈ ఆడియన్స్‌కు మరో ఆప్షన్ లేదు కాబట్టి. కానీ ఇప్పుడు ఈ సంక్రాంతికి పరిస్థితి వేరు. మరీ ముఖ్యంగా వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి ఫ్యామిలీ మూవీ ఉంది. సో…టికెట్ రేట్ల విషయంలో గేమ్‌చేంజర్‌కు ఇది తప్పకుండ కాస్ట్‌లీ మిస్టేజ్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి.