టాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ ఎంట్రీ

Viswa
2 Min Read
Comrade Kalyan Director Janajiram Marella

Web Stories

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ (Comrade Kalyan Movie) వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాతో టాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ ఎంట్రీ ఇచ్చారు దర్శకుడు జానకి రామ్‌ మారెళ్ల (Director Janakiram Marella). దర్శకుడిగా తన తొలి సినిమాతోనే, దర్శకుడిగా ప్రతిభచాటి ఇటు ప్రేక్షకులు…అటు ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు జానకిరామ్‌.

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ చిత్రంలో ఆయన బలంగా చూపించిన అంశం, కామెడీ టైమింగ్, సింపుల్‌ వన్‌ లైనర్స్, సహజమైన సంభాషణలు, సందర్భా నుసారంగా వచ్చే కామెడీతో థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. భారీ కామెడీ సన్నివేశాలపై ఆధారపడకుండా, సహజమైన సన్నివేశాలతోనే వినోదాన్ని పంచడంలో దర్శకుడిగా పూర్తిగా సక్సెస్‌ అయ్యారు జానకిరామ్‌ (Janakiram Marella).

కేవలం కామెడీ మాత్రమే కాకుండా, కమర్షియల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లను సైతం తనదైన శైలితో జానకిరామ్‌ మారెళ్ల అద్భుతంగా తెరకెక్కించారు. తన గురువు దర్శకుడు బాబీ (కేఎస్‌ రవీంద్ర) తరహాలోనే యాక్షన్‌ సన్నివేశాలను రిచ్‌గా, ఆకట్టుకునే విజువల్స్‌తో రూపొందించి, తనలోని టేకింగ్‌ స్కిల్‌ను చాటుకున్నారు. కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచుతూనే, యాక్షన్‌ సన్నివేశాలతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపడం ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

దర్శకుడిగా తొలి సినిమాతోనే వినోదానికి పెద్దపీట వేస్తూ, కథను ఆసక్తికరంగా తెరకెక్కించిన విధానంతో జానకిరామ్‌ మంచి గుర్తింపు తెచ్చుకు న్నారు. ప్రేక్షకులను మెప్పించేలా సన్నివేశాలను తీర్చిదిద్దడంలో తనకున్న పట్టును ప్రూవ్‌ చేసుకున్నారు. కామెడీ, యాక్షన్‌ రెండింటినీ బ్యాలెన్స్‌ చేస్తూ ఒక కంప్లీట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ను అందించడంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు.

Sree Vishnu Comrade Kalyan Director Janakiram Marella
Sree Vishnu Comrade Kalyan Director Janakiram Marella

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ విజయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న జానకిరామ్‌.. ఇదే టాలెంట్‌ను కొనసాగిస్తే భవిష్యత్తులో మరిన్ని ఆసక్తిక రమైన సినిమాలతో అలరించే అవకాశం ఉంది. తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన తదుపరి ప్రాజెక్టులపై ఇప్పుడు అంచనాలు పెరిగాయి.

ఇక శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ చిత్రంలో మహిమా నంబియార్‌ హీరోయిన్‌గా నటించగా, కోన వెంకట్‌ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం అక్టోబరు 9న థియేటర్స్‌లో రిలీజై, ప్రేక్షకాదరణతో ఇంకా సక్సెస్‌ఫుల్‌గా ప్రద ర్శితమౌతోంది.

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu