రజనీకాంత్‌ జైలర్‌ సినిమా మ్యాజిక్‌ రిపీట్‌ అయ్యిందా? ‘జైలర్‌ 2’ మళ్లీ హిట్‌?

Viswa
3 Min Read
rajikanth Jailer2 Cinema Review in Telugu

Web Stories

Rajinikanth Jailer2 review : హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్‌ కాంబినేషన్‌తో 2023లో వచ్చిన ‘జైలర్‌’ సినిమా విజయం సాధిం చింది. దీంతో ‘జైలర్‌ 2’ సినిమాకు నాంది పలికారు రజనీకాంత్‌. 2026లో దసరా సందర్భంగా ‘జైలర్‌ 2’ విడుదలైంది. మరి..ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలా స్పందన లభించింది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? అనేది చూద్దాం.

కథ

విలువైన పురాతన విగ్రహాలను అక్రమరవాణా చేసే వర్మ (వినాయకన్‌)ను ముత్తువేల్‌ పాండ్యన్‌ (రజనీ కాంత్‌) చంపేస్తాడు. విగ్రహాలు ఉన్న మూడు కంటైనర్స్‌ను ముత్తువేల్‌ ఎక్కడో దాచిపెడతాడు. అయితే వర్మ ఆటను ఆరికట్టే క్రమంలో తన కొడుకును తానే చంపేస్తాడు ముత్తువేల్‌. ఇది…జైలర్‌ కథ

‘జైలర్‌ 2’ సినిమా కథ విషయానికి వస్తే…వర్మ ముఠా నాయకుడు ఎవరు? అని తెలుసుకోవాలని ముత్తు వేల్‌ ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు ముత్తువేల్‌ దగ్గర ఉన్న మూడు కంటైనర్స్‌ను దక్కించుకోవాలని బోధి కల్పక్‌ (ఎస్‌జే సూర్య) అండ్‌ ముఠా ప్రయత్నిస్తుంటుంది. ఈ ముఠాలోని కీలక వ్యక్తి దీపక్‌ (సూరజ్‌ వెంజ రాముడు) ….ఎట్టకేలకు ముత్తువేల్‌ జాడను కనుక్కుంటాడు. మరి..ఆ తర్వాత ఏం జరిగింది? బోధికల్పక్‌ ఫ్యామిలీని అంతం చేయడానికి ముత్తువేల్‌ ఎలాంటి ప్లాన్‌ వేశాడు? ముత్తువేల్‌ తన సొంత కొడుకునే చంపాడన్న నిజం…ముత్తువేల్‌ ఫ్యామిలీకి ఎలా తెలుస్తుంది? అన్నది ‘జైలర్‌ 2’ సినిమా మిగిలిన కథ.

విశ్లేషణ

రజనీకాంత్‌ స్వాగ్, స్టైల్, మేనరిజమ్‌ లకు తోడు ఫ్యామిలీ ఎమోషన్స్‌ వర్కౌట్‌ కావడంతో, ‘జైలర్‌’ సినిమా మంచి విజయం సాధించింది. ‘జైలర్‌ 2’లోనూ ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడు ఈ చిత్రం దర్శకుడు నెల్స న్‌. ఎమోషన్స్‌ను జారిపోనివ్వకుండ పట్టుకుని, మంచి క్లైమాక్స్‌ను డిజైన్‌ చేసుకోగలిగాడు. ఫస్ట్‌హాఫ్‌లో వచ్చే మూర్తి పాత్రలో వచ్చే డార్క్‌ కామెడీ, టీ కొట్టులో, సెకండాఫ్‌లో బర్త్‌ డే పార్టీలో…ఇలా సినిమాలో వచ్చే రజనీకాంత్‌ ఎలివేషన్స్‌ కూడా ఆడియన్స్‌కు నచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా రజనీకాంత్‌ వయసుకు తగ్గట్లుగా నెల్సన్‌ యాక్షన్‌ సీన్స్‌ను డిజైన్‌ చేశాడు. ఎక్కడ ఓవర్‌ ది బోర్డ్‌ కాకుండ, రియాలిటీ అన్నట్లు ఆడియన్స్‌ను కన్వెన్స్‌ చేయగలిగాడు. శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, హృతిక్‌రోషన్‌..ల గెస్ట్‌ రోల్స్‌ కూడా ‘జైలర్‌ 2’ సినిమాకు బాగా ప్లస్‌ అయ్యాయి. మరీ..ముఖ్యంగా అనిరు«ద్‌ రవిచంద్రన్‌ మ్యూజిక్‌ ఈ సిని మాను బాగా అంటే బాగా ఎలివేట్‌ చేసింది. రజనీకాంత్‌ తర్వాత ‘జైలర్‌ 2’ సినిమాకు మరో హీరో ఎవర్నా ఉంటే అది అనిరు«ద్‌ రవిచంచర్‌నే అనే చెప్పవచ్చు. అంతా ఆర్‌ఆర్‌ ఇరగదీశాడు అనిరు«ద్‌.

Jailer2 Cinema Review in Telugu
Jailer2 Cinema Review in Telugu

నటీనటుల పెర్ఫార్మెన్స్‌

తన మేనరిజమ్‌ స్టైల్,స్వాగ్‌లతో రజనీకాంత్‌ మరోసారి తన మార్క్‌ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను అలరించా రు. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్‌ సీక్వెన్స్‌లో తన నటన అనుభవాన్ని రజనీకాంత్‌ చూపించారు. విలన్‌ బోధికల్పక్‌ పాత్రలో ఎస్‌జే సూర్య విలనిజం ఒకే. కానీ నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న దిలీప్‌ పాత్రలో సూరజ్, కాంత రోల్‌లో విద్యాబాలన్‌ మంచిగా పెర్ఫార్మెన్స్‌ చేశారు. మూర్తి పాత్రలో నమో నారాయణకు మంచి రోల్‌ లభించింది. ఫస్ట్‌హాఫ్‌ అంతా ఈ రోల్‌నే కథను ముందుకు నడుపుతుంది. మరోమారు యోగిబాబు మంచి రోల్‌ చేశాడు. రమ్యకృష్ణ, మీర్నామీనన్, చైల్డ్‌ ఆర్టిస్టు రుత్విక్‌..వారి వారి పాత్రల పరిధి మేరకు నటించారు. పూర్ణ, నోరాఫతేహిల స్పెషల్‌ సాంగ్స్‌ విజువల్‌గా బాగున్నాయి. నెల్సన్‌ కథ పరంగా కొత్త
డ్రామా ఏదీ రాసుకోలేదు. ఉన్నదాన్నే మరోట్రాక్‌లో తన ఓల్డ్‌ ఫార్ములాతోనే నెట్టుకోచ్చాడు. విలన్‌ ట్రాక్‌ చాలా ఓల్డ్‌గా ఉంది. రజనీ స్టైల్, అనిరు«ద్‌ మ్యూజిక్‌నే ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కెమెరా వర్క్‌ బాగుంది. విజువల్స్‌ ఒకే.

ఫైనల్‌గా….: మాస్‌ ఫ్లస్‌ క్లాస్‌ ఆడియన్స్‌ మెచ్చే చిత్రం. ఫ్యూర్‌ రజనీకాంత్‌ మేనియా.

రేటింగ్‌ 3/5

Please Share
Share This Article
5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu